పవిత్ర పుణ్యక్షేత్రాలలో పితృ పక్ష ఏర్పాట్లు & ఆచారాలు

(IPLTOURS)

శ్రాద్ధకర్మ కాశీతో పాటుగా చేయవలసిన క్షేత్రములు గయ మరియు ప్రయాగరాజ్. శాస్త్రాల్లో చెప్పినా పెద్దలు చెప్పినా మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిధి దేవోభవ అన్నమాటలు అక్షర సత్యాలు. కనిపించని దైవం కంటికి కనిపించే ఈరూపాల్లో ఉంటాడు అన్నది సుస్పష్టం. శ్రాద్ధకర్మ స్వగృహములో చేసుకొనవచ్చును. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పిండ ప్రధానం చేయడం ద్వారా వారికి నివాళు లర్పించడం తద్వారా తమకు మంచిభవిష్యత్తు ఉండేలా చూసుకోవడం సంతానం బాధ్యత. తల్లితండ్రుల మరియు పూర్వీకుల ఆత్మలు ముక్తి పొందుటకు పితృముక్తి క్షేత్రాలుగా పరిగణించు పంచ (ఐదు) గయ క్షేత్రాలైన శిరో గయ (బీహార్), నాభి గయ (ఒరిస్సా), పాద గయ (ఆంధ్రప్రదేశ్), మాతృ గయ (సిద్ధాపూర్, గుజరాత్) మరియు బ్రహ్మ కపాల్ (బద్రీనాథ్)లలో పిండ ప్రధానం చేయవలసి ఉంటుంది. పంచ గయాక్షేత్రములలో శారీరక ఆర్థిక దృఢత్వంలేక పిండ ప్రదానం చేయలేని వారు వారణాశి లేదా కాశీ, గయ మరియు ప్రయాగరాజ్ క్షేత్రములలో చేసేదమని అభిలాష ఉన్నవారి సౌలభ్యం నిమిత్తం ఈక్షేత్రములందు శ్రాద్ధకర్మలు చేయుటకు అనువైన ఆశ్రమములు మరియు సత్రముల వివరములతో పాటుగా పురోహితుల లభ్యత వివరములు తెలియచేస్తున్నాం. వారణాసి (కాశీ)లోని అన్ని ఆశ్రమాలు మరియు సత్రాలు దక్షిణ భారత శాఖాహార వసతితో మాత్రమే సౌకర్యాలు కల్పిస్తున్నాయని మేము తెలియజేస్తున్నాము.