శ్రీ వరసిద్ది వినాయక ఆలయం

(IPLTOURS)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరిజిల్లా  అయినవిల్లి గ్రామమునందలి స్వయంభూః శ్రీసిద్ధివినాయక ఆలయం ఎంతోప్రాముఖ్యం కలిగియున్నది. వాస్తుశాస్త్రమునందు నదీతీరములు, సముద్రతీరములు, నదీసంగమ తీరములు, పర్వతశిఖరములు మరియు నదిపరీవాహక ప్రదేశములు ఆలయనిర్మానమునకు యోగ్యమైనవిగా తెలుపబడినది. స్వయంభూః ఆలయములు, దేవతలతో, ఋషులతో మరియు రాజులతో నిర్మించబడిన ఆలయములన్నీ వాస్తురీత్యా యోగ్యమైన ప్రదేశములలోనే నిర్మించబడిఉండుట గమనార్హం. గోదావరీనది పరీవాహకప్రాంతములో కోనసీమకూడా వాస్తురీత్యా ఆలయనిర్మాణమునకు శ్రేష్టము. శ్రీసిద్ధివినాయక స్వామి ఆలయనిర్మాణం జరిగిన అయినవిల్లిగ్రామము కోనసీమనందే కలదు. రామాలయం లేని గ్రామము ఉండదని నానుడి ఆయిననూ ఆచరణలో రామాలయంలేని గ్రామము ఉండవచ్చేమోకానీ ప్రధమపూజ్యుడైన వినాయకుడుని పూజించనిదే ఆచరించు పూజాకార్యక్రమం ప్రారంభంకాదు. వినాయకరూపం ఒకేవిధంగా ఊహాలోకివస్తుంది.

Ainavilli Siddi Vinayaka swamy Temple

శ్రీసిద్ధివినాయక ఆలయం అయినవిల్లిగ్రామంలో రాకపోకలకు అనువుగా జిల్లాకేంద్రము కాకీనాడనుండి 63 కి.మీ. మరియు రాజమహేంద్రవరంనుండి 56 కి.మీ.దూరంలోఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు దక్షణముగా తిరుపతి సమీపమునందుకల కాణిపాకం వరసిద్ధివినాయకుని ఆలయముతో సమానముగా ఉత్తరముగానున్న అయినవిల్లినందున్న శ్రీసిద్ధివినాయకునికి మహాత్తుఉన్నదని భక్తులుభావిస్తారు. ప్రస్తుతకలియుగానికి మూడు యుగాలముందు కృతయుగంనుండే ఈఆలయము ప్రాచుర్యంలోనున్నట్లు కధనం. ఈక్షేత్రంగురించి గ్రంధములందు వివరించబడి యుండలేదు. 800సంవత్సరములకు పూర్వము శంకరభట్టుఅను సంస్కృత పండితునిచే వ్రాయబడిన దత్తాత్రేయఅవతారమైన శ్రేపాదశ్రీవల్లభచరిత్ర అనుగ్రంధములో ప్రస్తావించబడినది. శ్రీపాద శ్రీవల్లభులు 900 సం.లకు పూర్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు తూర్పుగోదారవిజిల్లా పిఠాపురంనందు అప్పలరాజశర్మ సుమతి దంపతులకు జన్మించారు. శ్రీపాదశ్రేవల్లభుని మాతామహుడు అనగా సుమతితండ్రి మల్లాది భావన్నారాయణ అవధానుల ఆధ్వర్యమునందు అయినవిల్లిగ్రామంలో స్వర్ణమహాగణపతియజ్ఞం నిర్వహించబడినట్లు యాగముచివర స్థానికపండితులు వినాయకుడు హోమద్రవ్యాలను తనతొండంతో స్వీకరించాలని, గణపతి స్వర్ణమయాకాంతులతో దర్శనంఈయవలెనని వాదించారు.

అపుడు వినాయకుడు హొమగుండములోని బూడిదనుండి మానవరూపముతో పిమ్మట మహాగణపతిగా దర్శనమిచ్చి పండితుల కోరికమేరకు స్వర్ణగణపతిగా హోమద్రవ్యాన్ని తనతొండముతో గ్రహించి పండితులపై ఆగ్రహించి త్రిపురాసురులను సంహరించుటకు ముందుశివుడు, బలిచక్రవర్తి అణచివేయడానికిముందు విష్ణువు, మహిషాసురుడిని సంహరించుసమయంలో కాళి, రావణుడు శివునిఆత్మలింగం లంకకు తీసుకొని వెళ్లకుండా నిరోధించు సమయంలో పార్వతీదేవి,. భూమిబరువు భరించుముందు ఆదిశేషుడు తననుస్మరించి వారికోరికలను సాధించినారని. అన్నిశక్తులు తనలోనేకలవని, తనలోదైవిక భంగిమలు అలాగే పైశాచికభంగిమలు కలవని అట్టి తనఉనికిని ప్రశ్నించిన ముగ్గురుపండితులలో ఒకరు సత్యంయొక్క వ్యక్తిత్వాన్ని కళ్ళతోచూసికూడా చూడలేదని చెప్పుటవల్ల ఆతను గ్రుడ్డివాడిగా, రెండవవారు సత్యాన్ని వ్యక్తీకరించడాన్ని ఎగతాళిచేసినందువల్ల అతను మూగవానిగా, భక్తులు చెప్పినసత్యాన్ని వినపడనట్లు ప్రవర్తించినందున మూడవవారు చెవిటివానిగా జన్మించెదరరని శపించి, వారుమరుజన్మలో తన స్వయంభూః మూర్తిని తాకినప్పుడు శాపవిమోచనం వారికి జరుగుతుందని శపించాడు. వారు గుడ్డి, మూగ, చెవిటివారిగా చిత్తూరు  జిల్లా కాణిపాకంలోజన్మించి నీటిలోస్వయంభూః గావెలసిన వరసిద్ధి వినాయకుని స్పర్శించినపిమ్మట శాపవిమోచనం పొందారు. ఆవృత్తాంతము కాణిపాకం వరసిద్ధివినాయక చరిత్రనందు చూడవచ్చు. కాణిపాకంనందు ఆవిర్భవించిన వరసిద్ధివినాయకునికి ముందే అయినవిల్లి సిద్ధివినాయకుడు స్వయంభూః గావెలసినట్లు దీనివలన తెలుస్తుంది.

వరసిద్ధివినాయకుడు తాను భవిష్యత్తులో భాద్రపడశుద్ధ చతుర్ధిరోజున పూర్తి శక్తి మరియు సద్గుణాలతో శ్రీపాద శ్రీవల్లభ అనుపేరుతో అవతరింతునని తెలిపీనట్లు శ్రీపాదశ్రీవల్లభచరిత్రలో తెలుపబడినది. దత్తాత్రేయ అవతారమైన శ్రీపాదశ్రీవల్లభునిగూర్చి దత్తావతారము లండు తిలకించవచ్చును. క్షేత్రపురాణము అనుసరించి చతుర్ముఖ బ్రహ్మ కుమారుడైన దక్షుడు తనచేజరుపబడుచున్న దక్షయజ్ఞము ఆటంకములు లేకుండా పూర్తిఆగుట కోరుచూ ఈప్రదేశమునందు వినాయకునికి పూజచెసి ప్రార్ధించినాడు. వ్యాసమహర్షి తన దక్షణ భారత పర్యటనకుముందు గణపతివిగ్రహం ఇచ్చట ప్రతిస్త్తించాడుఅని మరియొక కధనము. కానీ ఈకధనముకన్నా పైనతెల్పిన కధనమునకు ఆధారములున్నవి. కావున అయినవిల్లి సిద్ధివినాయకుడు స్వయంభూః అనిమాత్రమే భావించవలసిఉన్నది. భక్తులు శ్రీసిద్దివినాకాయస్వామిని వక్రతుండ మహాకాయ, కోటిసూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వకార్యేషు సర్వదా అనిధ్యానిస్తే ఆటంకాలు తొలగించి విజయం ప్రసాదిస్తాడని, దక్షణముఖంగా ప్రతిష్టించినందువలన సంపద మరియు శ్రేయస్సు వృద్ధిచెందుతుంది అనినమ్మేదరు.

ఓం గం గణపతయే నమః