ఉజ్జయిని
(IPLTOURS)
అవంతిక అను పురాతననామం కలిగిన ఉజ్జయిని శివునికి చెందిన అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రములందు ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగములలో మూడవజ్యోతిర్లింగం మహాకాలేశ్వర్ మరియు అష్టాధశ శక్తిపీఠములలో తొమ్మిదవ శక్తిపీఠం మహాకాళి కొలువైఉన్న పుణ్యక్షేత్రం. శివుడు రాక్షసరాజు త్రిపురాసురుడిపై విజయం సాధించడంతో అవంతిక నగరం విజయసంకేతంగా ఉజ్జయినిగా మార్పు చెందింది. 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడజరిగే కుంభమేళా ఉత్సవంతో ఉజ్జయిని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధం. శైవులు, వైష్ణవులతో పాటు తాంత్రిక అనుచరులకు ఉజ్జయిని ఒక ముఖ్యమైన తీర్థయాత్రగా కొనసాగుతోంది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు శివుని నివాసంగా చెప్పబడే పుణ్యక్షేత్రం.
ఆలయం పవిత్ర క్షిప్రానది ఒడ్డునఉంది. మహాకాళేశ్వర లింగరూపంలో ఉన్నశివుడు స్వయంభూః మరియు మంత్రశక్తితో శక్తిని తనలోనుండి పొందుతాడు. మహాకాళేశ్వరుని విగ్రహం దక్షిణాముఖి అంటే దక్షిణాభిముఖంగా ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరుడు మాత్రమే కనిపించే తాంత్రిక శివనేత్ర లక్షణం కలిగిఉంటాడు. ఉజ్జయినిలోని మరొక గొప్ప దేవాలయం నగర సంరక్షక దేవత కాలభైరవ దేవాలయం. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు ఆలయాన్నిసందర్శిస్తారు. ఆలయ దేవతకు సమర్పించే నైవేద్యాలలో మద్యం ఒకటి.
ఉజ్జయిని క్షేత్రం గురించి పూర్తికధనం మరియు దర్శనీయ స్థలములు, ఆలయముల వివరములు కాశీయాత్రనందు సంపూర్ణతీర్ధయాత్ర నందు సవివరముగా ఫోటోలు మరియు వీడియోలతో తెలియచేసి యున్నాము.