ఉత్తరభారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్నాధ్, బద్రినాధ్, పంచబద్రి, పంచకేదార్ తదితర శివకేశవ పుణ్యక్షేత్రములు ఉన్నట్లే దక్షణభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుజిల్లాలో ప్రముఖ శైవ మరియు వైష్ణవ క్షేత్రములున్నవి. పద్నాలుగునుండి ఇరవై రోజుల వ్యవధిలో కర్నూలుజిల్లాలోని పుణ్యక్షేత్రములు అన్నియు దర్శించవచ్చును. ఛోటా చార్ ధామ్ యాత్రలో యమునొత్రి, కేదార్నాధ్ తదితర క్షేత్రములకు పర్వతప్రయాణం ఉన్నట్లే శ్రీశైలయాత్రనందు అహోబిలం నవ నృసింహ క్షేత్రములలో కొన్నిఆలయములు దర్శించుటకు పర్వతప్రాంతమున నడక/డోలీ ద్వారా ప్రయాణించవలసి ఉంటుంది. శ్రీశైల యాత్రనందు దర్శించే ఆలయములు, క్షేత్రములు అన్నియు విశిష్టమైనవి, కృతయుగపు పురాణకధలతో, స్థానిక కధనాలతో ఒక్కొక్షేత్రం వినూత్నంగా ప్రాచుర్యమునందున్నవి.
శ్రీశైలయాత్ర కర్నూలుజిల్లాలోని నంధ్యాలపట్టణం నుండి ప్రారంభం అవుతుంది. నంధ్యాలనందు దేశంలోనే రెండవ జగజ్జననిఆలయం, నవనందులలో మూడునందీశ్వర ఆలయములు దర్శించవచ్చును. బస మరియు భోజనమునకు నంద్యాలనందు మధ్యతరహా మరియు ఉన్నతశ్రేణి హోటల్స్ లభ్యం. నంద్యాల నుండి మార్గమధ్యములో మూడునందులు దర్శించి 17 కి.మీ. దూరంలోని మహానంది చెరీ మహానంది నందు మహానందితోసహా మూడు నందీశ్వరాలయములు దర్శించవచ్చును. మహానందిలో అద్దె చెల్లించు పద్దతిపై సత్రములు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థవారి హోటల్ ఉన్నవి. మహానంది పిమ్మట మిగిలిన్ క్షేత్రములు దర్శించుటకు మరలా నంధ్యాల చేరవలసియున్నది.
నంధ్యాలనుండి ప్రయివేటు వాహనముపై అహోబిలం చేరి బసచేసినట్లయిన మూడురోజుల వ్యవధిలో దిగువ మరియు ఎగువ అహోబిలం నందున్న నవనృసింహ క్షేత్రములు దర్శించవచ్చును. అహోబిలంనందు బస మరియు భోజన సౌకర్యం లభ్యం. తదుపరి యాగంటిలో ప్రసిద్ధమైన బసవన్న (నంది) ఉమామహేశ్వర, శ్రీవేంకటేశ్వర ఆలయములు దర్శించవచ్చును. యాగంటి నందు బసచేయుటకు ఆర్యవైశ్యుల సత్రము మరియు ఉచిత భోజన సదుపాయం ఉన్నది. యాగంటినుండి తిరుగుప్రయాణములో బనగానపల్లి నందు పోతులూరు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామిమఠం, మరియు నందవరం గ్రామంలో స్థానికకధనంతో విశాలాక్షీదేవిగా పిలువబడుచున్న చౌడేశ్వరీదేవిని దర్శించి నంధ్యాల లేదా కర్నూలు చేరవచ్చును.
కర్నూలు లేదా నంధ్యాలనుండి ద్వాదశజ్యోతిర్లింగములందు రెండవ జ్యోతిర్లింగమైన మల్లిఖార్జునస్వామిని మరియు అష్టాధశ శక్తిపీఠములలో ఆరవ శక్తిపీఠం బ్రమరాంబాదేవిని దర్శించుటకు శ్రీశైలం చేరవచ్చును. శ్రీశైలంనందు రెండురోజులు బసచేసి ఆలయములు మరియు పవిత్ర ప్రదేశములు దర్శించవచ్చును. చైత్ర మాసములో పౌర్ణమిముందుగా యాత్రచేసిన శ్రీశైలం కృష్ణానది ఆవలి భాగమున నున్న శైలేశ్వరం చూడ వచ్చును. పిమ్మట కర్నూలుచేరి మంత్రాలయం నందు రాఘవేంద్రస్వామి మఠం, సమీపంలో గొబ్బూరు గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామిని మరియు 5వ శక్తిపీఠం అయిన అలంపురం జోగులాంబ దర్శనం చేసుకొనవచ్చును. తరువాయి కర్నూలుజిల్లాలోనే కృష్ణ, వేణి, తుంగబద్ర, భీంరాధి, మలపాహిని, సంగమేశ్వర మరియు భవనాశనిఅను ఏడునదులు కలియు సంగమప్రదేశములో నీటిలో మునిగిఉండి అరుదుగా కనిపించు పవిత్ర సంగమేశ్వరఆలయం దర్శించి తిరిగి కర్నూలునుండి స్వస్థలం చేరవచ్చును.
దేశంలోని అన్నిపట్టణాలు మరియు నగరాలతో అనుసంధానించ బడిన నంద్యాల మరియు కర్నూలుకు యాత్రికులు రైలులో ప్రయాణించవచ్చు. శ్రీశైలం తీర్థయాత్రలోని పుణ్యక్షేత్రాలు రైలుతో అనుసంధానింప బడనందున ప్రైవేట్ వాహనం లేదా బస్సులో ప్రయాణించవలసి ఉంటుంది.
శ్రీశైలం
సలేశ్వరం
నవ నంది క్షేత్రాలు
శ్రీ జగజ్జనని దేవాలయం
యాగంటి
బరహ్మంగారి మఠం
శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం
అహోబిలం నవ నృసింహ క్షేత్రాలు
అలంపురం
మంత్రాలయం
సంగమేశ్వరం
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం
వృద్ధ మల్లికార్జున ఆలయం
IPLTOURS – Indian Pilgrim Tours