శ్రీ అమరనాథ్ లింగం
(IPLTOURS)
(IPLTOURS)
భారత దేశములో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమునందు ఆ రాస్థ్త్రమునకు వేసవి రాజధాని అయిన శ్రీనగర్ పట్టణమునకు 141 కి.మీ దూరమునందు కల ప్రషిద్ధ హిందూ పుణ్య క్షేత్రము అమర్నాధ్ గుహ. ఈ అమర్నాధ్ క్షేత్రమునకు పహల్గామ్ పట్టణము లేదా బల్తల్ ద్వారా ప్రయాణించవలసి ఉంటుంది.
యాత్రికులు దేశవిదేశములనుండి రైలు విమాన ప్రయాణముచేసి శ్రీనగర్ చేరి ఆచటినుండి రోడ్డుద్వారా బస్సులో కానీ టాక్సీలో కానీ పహల్గామ్ చేరెదరు. శ్రీనగర్నుం డి 88 కి.మీ బస్సు లేదా ప్రయివేటు వాహనము ద్వారా పెహల్గామ్ చేరవలసిఉంటుంది. పెహల్గామ్ నుండి నాలుగురకముల ప్రయాణసాధనములుకలవు. 1.హెలీకాప్టర్ 2.డోలీ 3. గుర్రము 4.నడక. పెహల్గామ్ నుండి సుమారు 50 కిలోమీటర్లు డోలీ, గుర్రం లేదా నడక మార్గముల ద్వారా ప్రయాణించి అమర్నాధ్ గుహ చేరవచ్చును. చాలా కష్టరమైన ప్రయాణము. సుమారు మూడురోజులు ప్రయాణించి అమర్నాథ్ గుహ చేరవలసి ఉంటుంది. పల్లకి లేదా డోలీ నలుగురు మోయవలసి ఉండుట వలన రాను పోను 13000 నుండి 14000 వరకు ఖర్చుఅవుతుంది. అమర్నాధ్ యాత్ర పహల్గామ్ నుండి 45 కిలోమీటర్లు నూన్ వాన్ మరియు చందన్ వారి బెసే కేంపులద్వారా పర్వతప్రాంతములో trek మార్గము ద్వారా ప్రయాణించి శేషనాగ్ సరస్సు మరియు పంచ్ తర్ణికేంపుల యందు రాత్రులందు విశ్రమించి అమర్నాధ్ గుహను చేరవలసి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ అంతయూ సుమారు 7000 నుండి 14500 అడుగుల ఎత్తులో చేయవలసి ఉంటుంది. పహెల్గామ్ నుండి తమ ఆహారము బట్టలు మ్రోయుటకు కూలీలు పల్లకీలు యాత్రికులే సమకూరుచుకోవలసి ఉంటుంది. ఈమార్గము నందు అమర్నాథ్ లోయతో పాటుగా అమరావతి నది మరియు అమర్నాధ్ హిమపాతమునను జనించు దాని ఉపనది చెనాబ్ లను కూడా దర్శించవచ్చును.
అమర్నాధ్ గుహ చేరుటకు మరియొక మార్గము ఉత్తరముగా బల్తల్ చెరి ఆచటి నుండి బారరి మరియు సంగం మీదుగా 16 కిమీ దగ్గర మార్గము ఉన్నది కానీ ఆ మార్గము చాలా నిలువుగా యుండి అధిరోహించుట చాలా కస్టము. ఈ మార్గముశ్రీనగర్ నుండి 60 కి.మీ బస్సులో కానీ ప్రయివేటు వాహనములో కానీ ప్రయాణించి బల్తల్ చేరి అచ్చటినుండి ప్రాంభమై డోమెల్, బరారి మరియు సంఘం మీదుగా అమర్నాధ్ గుహ చేరును.
పెహల్గామ్ మరియు బాల్తాల్ విమానాశ్రయములనుండి అమర్ నాధ్ గుహకు 6 కి.మీ దూరములో నున్న పంజతర్ణి విమానాశ్రయం (బెసే కాంప్) నకు పలు వినానయాన సంస్థలు హెలీకోప్టర్ సౌకర్యము ఏర్పాటు చేసినారు. శ్రేనగర్ నుండి 54 కి.మీ దూరములో నున్న పెహల్గామ్ హెలీపాడ్ నకు బస్సులోగానీ టాక్సీలోగాని రోడ్డుమార్గమున ప్రయాణించి చేరవచ్చును.
పెహల్గామ్ హెలీపాడ్ నుండి పంజాతర్ణి హెలెపాడ్ నకు సుమారు 10 నిమిషములు హెలీకోప్టర్ నకు రూ 4710/ (రానుపోను చార్జీ) చెల్లించి ప్రయాణించ వచ్చును. లేదా శ్రీనగర్ నుండి 60 కి.మీ. దూరములో నున్నబాల్తాల్ విమానాశ్రయమునకు బస్సులోగానీ టాక్సీలో గాని రోడ్డు మార్గమున ప్రయాణించి చేరవచ్చును. బాల్తాల్ హెలీపాడ్ నుండి పంజాతర్ణి హెలెపాడ్ నకు హెలీకోప్టర్ నందు రూ 2890/- (రానుపోను చార్జీ) చెల్లించి చేరవచ్చును. పంజాతర్ణి హెలిపాడి నుండి 6 కి.మీ. నడకద్వారాకాని పల్లకీలోగానీ ప్రయాణించి కేదార్నాధ్ గుహ చేరవచ్చును. దర్శనము పిమ్మట మరలా పంజాతర్ణి హెలీపాడ్ చెరీ అచ్చటినుండి పెహల్గామ్ లేదా బాల్తాల్ హెలీకోప్టర్ లోనూ మరల శ్రీనగర్ రోడ్డు మార్గము ద్వారాను చెరి యాత్ర పూర్తి చేయ వచ్చును. అమర్నాథ్ క్షేత్రము మంచు పర్వతములతో చుట్టబడి హిందూమతమునందు పవిత్రపుణ్యక్షేత్రముగా గుర్తింపబడి యున్నది. వేసవినందు యాత్రికులదర్శనార్ధము తెరువబడు కొద్దికాలముమినహా మిగిలిన సంవత్సరామంతయూ ఈగుహ మంచుతో కప్పబడిఉంటుంది. భారతదేశమునందలి అన్నిప్రాంతముల నుండి మరియు విదేశములనుండి అమర్నాధ్ నకు పర్వతభూభాగము దాటుకొని సంవత్సరయాత్ర చేయుదురు. 130 అడుగుల ఎత్తుకల ఈగుహ అంతర్భాగమున గుహపైకప్పునుండి జాలువారు నీటిబొట్లుగడ్డకట్టి మంచు పురాణములందు పేర్కొనినట్లుగా నిటారుగా శివలింగఆకృతులుగా తయారుకాబడును. ఈశివలింగఆకృతి మేనెలనుండి ఆగష్టునెలలమధ్య ఘనీభవించి కాలక్రమముగా నెమ్మదిగా క్షీణించును. చంద్రకళలనుబట్టి లింగముపెరుగుట క్షీణించుట జరుగును. శివుడు నందిని పహల్గావ్ అనుచోట, చందన్ వారి అనుచోట తనఝటాఝూటమునుండి చంద్రుని, శేషనాగ్ సరస్సువద్ద నాగులను, మహాగుణపర్వతమువద్ద గణేశుని, పంజ్ తర్ణివద్ద భూమి, నీరు, వాయవు, అగ్ని మరియు ఆకాశమును తన వెనుక వదలి తాండవనృత్యము చేసినాడు అని, చివరిగా అమర్నాథ్ గుహనందు పార్వతీమాతతో ప్రవేశించినాడని, శివుడు పార్వతికి జీవనరహశ్యము ఇచ్చటనే తెలిపినాడు అని హిందువులు విశ్వసింతులు. సూర్యమతి అనురాణి 11వ శతాబ్దములో త్రిశూలము, గాజులు తదితర పవిత్ర చిహ్నములు బహూకరించినారు.
అమర్నాథ్ గృహ ప్రధమముగా బృగుమహర్షిచే కనుగొనబడినది. కాశ్మీర్ లోయఅంతయూ గతములో నీటితో మునిగిపోయినదని, కశ్యపమహర్షి ఈనీటిని అంతటినీ అనేకనదులు ఉపనదులుగా విభజించి లోయ ఖాళీచేసినాడు అని, బృగుమహర్షి ప్రప్రధమముగా అమర్నాధ్ ప్రభువును దర్శించినాడని, ప్రజలు ఈలింగము గురించి తెలుసుకొనినారని, అప్పటినుండి వేల సంఖ్యలో బోలెనాధ్ ప్రభువును దర్శించుటవలన ఈప్రదేశము పవిత్రప్రదేశముఅయినదని విశ్వసిస్తారు. స్థానిక గదారియాతెగకు చెందినవారు ముందుగా అమర్నాథ్ గుహనుకనుగొని మొదటిసారిగా ఈపుణ్యక్షేత్రముపై సంగ్రహావలోకనం చేసినారు. 1663 సంవత్సరములో ముఘల్ రాజు ఔరంగజీబుతో ఒకఫ్రెంచ్ డాక్టరు తనచేవ్రాయబడిన “ట్రావెల్స్ ఆఫ్ ముఘల్ ఎంపైర్” నందు అమర్నాధ్ గుహ ఒకఅద్భుతముఅని ఇచటగుహ పైకప్పునుండి జాలువారు నీరుఘనీభవించి లింగాకారములు తయారు కాబడునని హింధువులు అనేకులు ఈఆకృతులను శివుని రూపములుగా కొలుస్తారని వ్రాశాడు.
ప్రతి సంవత్సరము వేసవి కాలములో జూలై ఆగస్టు మాసములందు శ్రావణ మాసములో శ్రావణ మేలా జరుగు 45 రోజులలో ఘనీభవించిన మంచుతో శివలింగము తయారు కాబడు సమయమునందు జరుగు ఈ అమర్నాధ్ ఆయాత్రానందు లక్షల కొలదీ యాత్రికులు పాల్గొని హిమాలయములందు సుమారు 13000 వేల అడుగుల ఎత్తుయన కల అమర్నాధ్ గుహను సందర్శించి శివలింగమును దర్శించి పులకించేదరు. రాష్ట్ర ప్రభుత్వమునకు యాత్రికులపై పన్ను విధింపుద్వారా ఆదాయము సమకూరుతుంది. ఈ ఆదాయము నుండి కొంత భాగము తీసుకొని స్థానిక షియా ముస్లిం బకార్వాల్ గుజ్జారాలు హిందూ యాత్రికులకు సేవలను సమకూరుస్తారు.
అమర్నాధ్ గుహను చేరు మార్గములో పెక్కు స్వచ్ఛంధ సంస్థలు యాత్రికులకు ఉచితముగా ఆహారము సరఫరా చేయుటకు మరియు సేద తీరుటకు పండాల్స్ అంబడే గుడారములను ఏర్పాటుచేయుడురు. అమర్నాధ్ గుహ వద్ద స్థానికులచే రాత్రి బస చేయుటకు వీలుగా పెక్కు గుడారములు అద్దె చెల్లించు ప్రాతిపదికపై ఏర్పాటు చేయుడురు. కాశ్మీరీ మిలిటెంట్లు ఈ సేవలకు ఆదాయమునకు విఘాతము కలిగించుటకు పలుమారులు యాత్రికులపై దాడులు నిర్వహించి అనేక హిందూ యాత్రికులతో పాటు కొందరు ముస్లిం పౌరులను భద్రతా సిబ్బంధిని కూడా హతమార్చినారు. వేల సంఖ్యలో కేంద్ర సైనికదళమును మరియి రాష్ట్రపోలీసులను ప్రతి సంవత్సరము ప్రయాణికులకు ఉగ్రవాదులనుండి రక్షణ నిమిత్తము ఏర్పాటు చేయుడురు. వీరు యాత్రికులు బస చేయు ప్రాంతములోనూ అమర్నాధ్ గుహ ప్రాంతములోనూ పహరా కాయుచూ యాత్రికులకు రక్షణ కల్పింతురు.
ఈయాత్ర చేయడానికి శరీరకంగా మరియు మానసికంగా ధృఢత్వము కలిగి యుండవలెను. మానసిక దౌర్భాల్యము కలవారు గానీ శరీరధృడత్వము లేనివారు ఈయాత్రలు ప్రయత్నించుట మంచిదికాదు. యాత్ర చేయువారి ధృఢత్వము ముందుగా పరీక్షచేసి పిమ్మటమాత్రమే యాత్రకు అనుమతించబడుదరు. అమరనాధ్ యాత్రకూడా మానస సరోవర్ యాత్రనలేనే కస్టతరమైంది. అమర్నాధ్ యాత్రకు 50 కిలిమీటర్లు పర్వత ప్రాంతమున నడక ద్వారా చేయవలసి ఉంటుంది. కావున యాత్రచేయదలచినవారు ప్రతిరోజూ నాలుగు కిలోమీటర్లు నడక అలవాటుచేసుకొనవలసి ఉంటుంది. ఈనడక ఉత్తరాదియాత్రలలు అన్నిటిలోనూ ఉపకరిస్తుంది. బలమైనగాలులు వీచేఅవకాశముండును. అందువలన యాత్రకు బయలుదేరుసమయమునందు అవసరమిన తేలికైన ఉన్నిదుస్తులు మరియు ఇతరసామగ్రి తీసుకు వెళ్లవలసి ఉంటుంది. ప్రధానమైన సౌకర్యాలు, మరియు వసతి ఈయాత్రలో డేరాఇండ్లలో లభించును. యాత్రికులు తాము నిద్రపోవుటకుఅవసరమైన సామాగ్రి తీసుకు వెళ్లవలసి ఉంటుంది యాత్రికులు తమతో పాటు తేలికఆహారము, తిను బండారములు తీసుకు వెల్లవలసి ఉంటుంది. సాధారణము సౌకర్యవంతము మరియు వెచ్చని దుస్తులు బలమైన మరియు తేలికైన నీటికి తడవని బూట్లు అమర్నాథ్ యాత్రకు అవసరం అవుతాయి. యాత్ర నందు సౌకర్యము కొరకు యాత్రికులు తేలికైన తక్కువ సామాత్రితో ప్రయాణించ వలెను. సామాగ్రి మోయుటకు గుర్రములు లభ్యమగును. అనేక ట్రావెల్ ఏజెన్సీలు రూ 50000 నుండి రూ 60000 పాకేజీలతో అమర్నాధ్ యాత్ర ఏర్పాటు చేస్తారు.
IPLTOURS – Indian Pilgrim Tours