పంచకేదార్
(IPLTOURS)
హిమాలయ పర్వతములలో నున్న పంచకేదార్ క్షేత్రములు శివలింగ క్షేత్రములలో ప్రశస్తమైనవి. ఈ పంచ కేదార్ క్షేత్రములు కేదారేశ్వర్ నుండి బదరీనాధ్ వరకు విస్తరించి యున్నవి. అవి 1. కేదారేశ్వర్ 2. మధ్యమహేశ్వర్ 3. తుంగనాధ్ 4. రుద్రనాధ్ 5. కల్పెశ్వర్. కేదార్నాధ్ నుండి బదరీనాధ్ మార్గములో కేదార్నాధ్, మధ్యమహేశ్వర్, తుంగనాధ్, రుద్రనాధ్ మరియు కల్పెశ్వర్ క్షేత్రములు సముద్ర మట్టము నుండి 12000 నుండి 7000 అడుగుల ఎత్తులో ఉన్నవి.
కల్పెశ్వర్ ఒక్కటి మాత్రమే అన్నీ కాలములలోనూ దర్శించుటకు వీలగును. మిగిలిన క్షేత్రములు ఆన్నియు ఒక్క వేసవిలో తప్ప మిగతా కాలములలో మంచుతో కప్పబడియుండుట వలన వేసవిలో మాత్రమే దర్శించుటకు వీలగును. ఈ క్షేత్రములన్నిటికీ అధిక భాగము ప్రయివేటు వాహనములో ప్రయాణించిననూ కొంతదూరము పర్వతములపై కాలి నడకన, డోలీ లేదా గుర్రముపై ప్రయాణించి చేరుకోనవలసి యున్నది.
ఉత్తరాఖంఢ్ లో వున్న అనేక యాత్రా స్థలాలు పర్వతములపై కాలినడకనే వెళ్ళవలసి వుంటుంది శారీరక అలసట తెలియకుండా ఉండేందుకు గాను అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. ఇక్కడ సంవత్సరానికి రెండే కాలాలు. ఒకటి శీతాకాలం, రెండు మంచు కురిసే శీతాకాలం. ఇక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి మందిర ట్రస్టు ఈ ఆలయములు యెప్పుడు తెరవాలి అనేది నిర్ణయిస్తుంది. నడవలేని వారికోసం గుఱ్ఱాలు, డోలీలు దొరుకుతాయి. చాలా చోట్ల ఎత్తు (స్టీప్) ఎక్కవలసి రావడంతో కాస్త ఆయాసం ఎక్కువగా అనిపిస్తుంది.
ఈ ప్రదేశానికి పర్వతారోహకులు తప్ప మామూలు యాత్రికులు చాలా తక్కువ సంఖ్యలో వస్తూవుంటారు. అందు వలన యీదారి కొద్ది నిర్మానుష్యంగా వుంటుంది. కాలి నడక మొదలయ్యే ప్రాంతంలో మాత్రమే చల్ల, వేడి పానీయాలు తినుబండారాలు దొరకుతాయి. మరలకోవెల ప్రాంతంలో అన్నీ దొరుకుతాయి. యాత్రికులు హిమాలయాలలో ఉదయమే వీలైన సూర్యోదయానికి పూర్వం యాత్ర మొదలు పెట్టి సూర్యాస్తమయానికి ముందు లేక సూర్యాస్తమయం అయిన వెంటనే ప్రయాణం నిలిపివేస్తే చాలా ఆపదల నుంచి తప్పించు కోవచ్చును.
ముఖ్యంగా ఇక్కడి వాతావరణంయెండవానలతో నమ్మలేని విధంగా మారుతూ వుంటుంది. ద్వాపర యుగము చివరిలో శివుని మెప్పించుటకు పాండవులు ఈ అయిదు పుణ్య దేవలయములను నిర్మించినారు. ఈ అయిదు పుణ్య క్షేత్రములలో శివుడు వివిధ రూపములలో కొలువబడి యున్నాడు. శివుడు నంది (ఎద్దు) రూపములో అదృశ్యమై ఆరు భాగములుగా మూపుర భాగము కేదారేశ్వర్ నందు, నాభి మరియు ఉదర భాగము మధ్యమహేశ్వర్ లోనూ, చేతులు తుంగనాధ్ లోనూ, ముఖము రుద్రనాధ్ లోనూ, కురులు కల్పెశ్వర్లతో పంచ కేదార్ తోపాటుగా తల నేపాల్ లోని పశుపతినాధ్ నకు 25 కి.మీ. దూరమునందు కల చౌలిమహేశ్వర్లతో కలిపి ఆరు దివ్య క్షేత్రములుగా వ్యాప్తి చెందినవి. శివుని (నంది) మూపురము కొలువబడు చున్న కేదార్నాధ్ నకు ముందుగా శివుని తలభాగము పూజింపబడు చున్న పశుపతినాధ్ నకు 25 కి.మీ దూరములో కల చౌలి మహేశ్వర్దే వాలయము నుండి ఈ యాత్ర ప్రారంభము అవుతుంది. కేదార్నాధ్ చిహ్నము పశుపతినాధ్ ఆలయగోపురముపై దర్శనము ఇచ్చును.
పంచకేదార్ యాత్ర పూర్తి అయిన పిమ్మట చివరిగా విష్ణు భగవానుడు వెలసి యున్న బదరీనాధ్ దర్శించి అచట కూడా శివుని దీవనలు పొందవలసి ఉంటుంది. తుంగనాధ్ నందు తప్ప మిగిలిన క్షేత్రములలో పూజారులు దక్షణ భారతము నుండి వలస వెళ్ళిన వారే. బదరీనాధ్ ఆలయము నందలి పూజారులు కేరళ రాష్ట్రమునందలి మలబార్ నుండి వలస వెళ్ళినవారు. మధ్య మహేశ్వర్ ఆలయ పూజారులు జంగమ లేదా వీర శైవ లింగాయుతులు. రుద్రనాధ్ నందు మరియు కల్పెశ్వర్ ఆలయము లందు ఆది శంకరాచార్యులచే నియమించ యాడిన దాసనమీ గోసన కులస్థులు పూజా కార్యక్రమములు నిర్వర్తించెదరు. తుంగనాధ్ నందు కాశీ బ్రహ్మలు సేవ చేయదురు. కేదారనాధ్ తీర్ధములో కల పురోహితులు లేదా పండాలు హిమాలయ ప్రాంతములో పూర్వకాలము నుండి అనగా కృతయుగము ఆఖరు మరియు ప్రస్తుత కలియుగ ప్రారంభము కాలము నుండి ఉన్నటు వంటి బ్రాహ్మణులు మరియు వారి వంశీకులు. పాండవులు మోక్షము పొందుటకు మహాప్రస్థానము నకు వెళ్లినప్పుడు వారి ముని మనుమడు అయిన జనమే జయుడు కేదారనాధ్ వచ్చి ఆలయనందు పూజాధికములు నిర్వర్తించు అధికారము ఈబ్రాహ్మణ కుటుంబీకు లకు ఇచ్చినట్లు ఈ ప్రాంత వాసులు తెలుపుతారు.
ఈ ఆలయ పూజారులు గుప్తాక్షి నందు నివాసముంటారు. ఒక్క కేదార్నాధ్ మరియు బదరీనాధ్ నకుతప్ప పంచకేదార్ లోని మిగితా 4 కేదార్ లకు వెళ్ళుటకు బస్సు సదుపాయము కానీ విమాన సదుపాయము కానీ రైలు సదుపాయము కానీ లేదు. యాత్రికులు పంచ కేదార్ యాత్ర నిమిత్తము అద్దె వాహనముపై వెళ్ళి వచ్చుటకు ఋషీకేశ్ నుండి సుమారు 800 కి.మీ. మరియు పర్వతారోహణము నడక ద్వారా 130 కి.మీ. ప్రయాణించవలసి యున్నది. కావున యాత్రికులు యాత్ర ప్రారంభమునకు ముందుగా 6 నెలలు ముందు నుండి రోజువారీ నడక అలవాటు చేసుకొనవలెను. వయస్సు పై బడిన వారు మరియు షుగరు, బి.పి. మరియు హుద్రోగము ఉబ్బసము కలవారు ఈ యాత్ర చేయవలెను అన్న ఆలోచన విరమించు కొనుట మంచిది.
ఉత్తరాంచల్ టూరిజం కార్పొరేషన్ వారు ఒక్కొక్కరికి రూ 45,000/- చార్జీతో పంచ కేదార్ యాత్ర 14 రాత్రులు/15 రోజులు షెడ్యూలు తో ఏర్పాటు చేసి యున్నారు. అదియును కాలినడక (పర్వతారోహణ) కాక. బదరీనాధ్ నుండి బయలుదేరి కల్పెశ్వర్, రుద్రనాధ్, తుంగనాధ్, మధ్యమహేశ్వర్, కేదార్నాథ్ దర్శనము పిమ్మట చివరిగా ఋషీకేశ్ చేరుకొని ఆచటినుండి పశుపతినాధ్ దర్శించుట యాత్రకు వీలుగా నుందును. కానీ యాత్ర కేదార్నాథ్ నుండి బయలుదేరి మధ్యమహేశ్వర్, తుంగనాధ్, రుద్రనాధ్, కల్పెశ్వర్ దర్శనము పిమ్మట బదరీనాధ్ వెళ్లవలసి యున్నది.
స్థలపురాణం ప్రకారం మహాభారత కాలమునందు పాండవులు తమ దాయాదులు కౌరవులను కురుక్షేత్ర సంగ్రామమునందు నిర్జించినారు. పాండవులు యుద్ధము నందు చేసిన పాపములైన గోత్రీకుల హత్య మరియు గోహత్యల నుండి విముక్తులు కావలెనని తలంచి తమ రాజ్య భారమును తమ వంశీకుడు పరీక్షిత్తునకు ఆవప్పగించి శివుని దర్శించి దీవెనలు పొందవలెలేనని వెతుకుచూ బయలుదేరినారు. వారు శివునికి ప్రీతి పాత్రమైన వారణాశి పుణ్య క్షేత్రమును చేరగా శివుడు వారిపై కురుక్షేత్ర సంగ్రామమునందు వారివలన కలిగిన ప్రాణ నష్టమునకు కోపగించి వారిప్రార్ధనలను వినిపించుకోకుండా వారినుండి తప్పించు కొనవలెనని తలచి ఎద్దు (నంది) రూపముపొంది హిమాలయ ప్రాంతమునందు అదృశ్యమైనాడు. వారణాశినందు శివుని కనుగొనలేక పాండవులు హిమాలయములకు వెళ్ళినారు. భీముడు గుప్తాక్షి వద్ద రెండు పర్వతముల మధ్య నిలబడి చూడగా నంది రూపములో శివుడు గడ్డి మేయుచూ కనిపించినాడు. భీముడు నంది తోకపట్టుకొని ఆపుటకు ప్రయత్నించగా ఆచటి నుండి అదృశ్యమై తరువాత ప్రత్యక్షమై ఆరు భాగములుగా విడిపోయినది. మూపుర భాగము కేదార్నాధ్, చేతులు తుంగనాధ్, బొడ్డు మరియు ఉదరభాగము మధ్య మహేశ్వర్, ముఖ భాగము రుద్రనాధ్ మరియు జుట్టు కల్పెశ్వర్ లతో పాటు తల భాగము నేపాల్ నందు ఖాట్మండునకు 25 కి.మీ దూరములో కల చౌలి మహేశ్వర్ నందు పడినవి. పాండవులు శివుని కొలుచుటకు గాను అయిదు స్తలములలోనూ ఆలయములు నిర్మించి వారి పాపములనుండి విముక్తి పొందినారు. శివుని తల భాగము పడిన ప్రదేశము నేపాల్ లోని చౌలి మహేశ్వర్.
పాండవులు శివుని కొలుచుటకు గాను అయిదు స్తలములలోనూ ఆలయములు నిర్మించి వారి పాపములనుండి విముక్తి పొందినారు. శివుని తల భాగము పడిన ప్రదేశము నేపాల్ లోని చౌలి మహేశ్వర్. పాండవులు చౌలిమహేశ్వర్ మినహా మిగిలిన పంచ కేదార్ ఆలయములు నిర్మించిన పిమ్మట ఈ ఆలయములందు తపస్సు యజ్ణము చేసి బదరీనాధుని దర్శించి మానా గ్రామము నుండి వారు స్వర్గారోహణ యాత్ర చేసినారు.