భారత దేశమునందు గతించినవారికి పితృఖర్మలు మరియు పిండప్రధానం చేయతగిన అయిదు ముక్తిక్షేత్రములు ఉన్నవి. భీహార్ రాష్ట్రం గయనందు శిరోగయ, ఒరిస్సారాష్ట్రం జాజిపూర్ నందు నాభిగయ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పితాపురం నందు పాడగయ మూడింటిని త్రిగయాక్షేత్రములుగా పేర్కొంటారు. త్రిగయా క్షేత్రములతోపాటు హిమాలయకులలో బదరీనాధ్ నందుకల బ్రహ్మకపాలం మరియు గుజరాత్ రాష్ట్రములో సిద్ధాపూర్ నండు బిందుసరోవవర్ లతోకలిపి పంచగయా క్షేత్రములు. అయిదుక్షేత్రములందు పితృదేవతలకు పిండప్రధానం చేయుటద్వారా వారికి ముక్తి కలుగునని భావించ బడుటవలన వీటిని పంచముక్తి క్షేత్రములని పురాణములందు లిఖించబడినది. శిరోగయ, నాభిగయ, పాడగయ మరియు బ్రహ్మకపాలంనందు లింగబేధంలేకుండా అందరికీ పిండప్రధానం చేయవచ్చును. సిద్ధాపూర్లోని బిందుసరోవరంలో మాతృదేవతలకు మాత్రమే శ్రాద్ధ కర్మలు మరియు పిందప్రధానం నిర్వహించవచ్చని పురాణాలలో వివరించబడింది.
వ్యాసమహర్షి త్రిగయా క్షేత్రములను గురించి పద్దెనిమిది పురాణములలో ఒకటి అయిన స్కంధపురాణం మూడవ ఖంఢంనందు గయ, జాజిపూర్, మరియు పిఠాపురం అను మూడు గయాక్షేత్రములందు మహావిష్ణువు బ్రహ్మ మరియు శివుడు గయాసురుడు అనురాక్షసరాజు కోరిక ప్రకారము కొలువై ఉన్నారని తెలుపబడినది. మరియు వీరితోపాటు దక్షుడుచేసిన నిరీశ్వర యాగమునందు అవమానిపబడిన సతీదేవి యోగాజ్ఞినందు దగ్ధమైనప్పుడు మహాదేవుని సతీదేవి వియోగమునుండి ఉపశమింప చేయుటకు సతీదేవి శరీరమును మహావిష్ణువు సుదర్శనచక్రంతో ఖండించినప్పుడు శరీరభాగములు భూమిపై చెల్లాచెదురుగాపడి రొమ్ము, నాభి, ఎడమచేయి భాగములు పడిన ప్రదేశములు గయ, జాజిపూర్ మరియు పిఠాపురంనందు మంగళగౌరి, గిరిజాదేవి మరియు పురుహూతిక శక్తిపీఠములుగా వెలసినవి.
శిరోగయ, నాభిగయ, పాడగయలు ఏర్పడుటకు పురాణకధనం ప్రకారం గయాసుడను రాక్షసరాజు మహావిష్ణువుగూర్చి దీర్ఘతపస్సుచేసి లోకమునందుకల పుణ్యనదులు అన్నిటికంటే తనశరీరము పవిత్రవంతమైనదిగా వరముపొండాడు. ఆవరప్రభావంవలన గయాసురుని శరీరముద్వారా వీచెడిగాలితో మానవులు మరియు ఇతరజీవులు వారిపాపములనుండి విముక్తిపొందుచుందేడివారు. గయాసురుడు అశ్వమేధ యాగముతోపాటు చేసిన యాగముల ఫలముతో ఇంద్రపదవి పొందుటవలన ఇంద్రుడు పదవీచ్యుతుడైనాడు. ఇంద్రుడు బ్రహ్మ, విష్ణు మరియు శివుని కోసం తపస్సు చేసాడు. గయాసురుని అనుచరులతో ప్రజలు బాధలు పడుతున్నారని, యాగంనుండి అవిస్సుఅందక దేవతలు బలహీనంగా ఉన్నందున గయాసురిని వధించి తన స్థానాన్ని పునరుద్ధరించమని ప్రార్థించాడు.
బ్రహ్మ, విష్ణు మరియు శివుడు గయాసురుడిని వధించాలని భావించి, బ్రాహ్మణుల వేషంలో గయాసురుని వద్దకువచ్చారు. భూమిపై యజ్ఞంకోసం పవిత్ర స్థలం లేనందున వారం రోజులపాటు వారు యజ్ఞం నిర్వహించడానికి అతనిశరీరాన్ని ఇవ్వమని కోరారు. యాగం ముగిసేవరకు అతని శరీరాన్ని కదపరాదని, షరతు అతిక్రమిస్తే సంహరిస్తామని షరతు విధించారు. అందుకు అంగీకరించిన గయాసురుడు తలను గయలో ఉదరం జాజీపూర్లో పాదాలను పిఠాపురంలో ఉందునట్లు తనశరీరాన్నిపెంచి యాగంచేయమని వారినికోరాడు. గయాసురుడు శరీరమును కదల్చక తెల్లవారుఝామున కోడికూతలనుబట్టి రోజులు లెక్కించుకోసాగాడు. ఆరురోజులు గడచినపిమ్మట ఇంద్రుడు తదితర దేవతలు యాగము నిర్విగ్నముగా పూర్తికాబడిన గయాసురుని నిర్జించుట సాధ్యంకాదని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్ధించినారు.
ఏడవరోజు అర్ధరాత్రి శివుడు కోడిగొంతుతో కొక్కురోక్కోఅని శబ్ధముచేయగా గయాసురుడు ఏదురోజులు పూర్తిఅయినవని బ్రమించి శరీరం కదల్చి లేచినాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు మాహేశ్వరులు గయాసురుడు వాగ్ధానభంగం కలిగించినందున సంహరించబోగా గయాసురుడు వారు త్రిమూర్తులని గ్రహింఛాడు. త్రిమూర్తులు గయాసురుని ఆఖరికోరిక కోరుకొమ్మని ఆడుగగా గయాసురుడు యాగమునందు తనతల, ఉదరము మరియు పాదములు ఉంచబడిన ప్రదేశములు గయాక్షేత్రములుగా ప్రసిద్ధి చెందలెనని, క్షేత్రములలో మరణానంతరము పిండప్రధానము జరుపబడు జీవుల ఆత్మలకు బ్రహ్మలోకం సిద్ధించవలెనని మూడుక్షేత్రములు శక్తిపీఠములుగా ప్రసిద్ధి చెందవలెనని కోరాడు. త్రిమూర్తులందు విష్ణువునిలచిన ప్రదేశము గయగాను, బ్రహ్మనిలచిన ప్రదేశము నాభిగయగాను శివుడునిలచిన ప్రదేశము పాడగయగాను మరణించిన జీవులకు మూడుక్షేత్రములలో చేయు పిండప్రధానము విశేషమని వారిఆత్మలకు బ్రహ్మలోకము సిద్ధించునని అంతేకాక మంగళగౌరి, గిరిజ మరియు పురుహూతిక పేర్లతో మూడుక్షేత్రములు శక్తిపీఠములుగాను ప్రసిద్ధిచెందుతాయని అనుగ్రహించారు. పిమ్మట మహావిష్ణువు గయాసురుని సంహరించి ఆతని శరీరము మూడు భాగములుగా ఖండించాడు.
బ్రహ్మకపాలం ఆవిర్భావచరిత్ర పురాణాకధనం ప్రకారం బ్రహ్మ అయిదు శిరస్సులు కలవారు. పంచముఖుడైన బ్రహ్మకు త్రిమూర్తులు ముగ్గురిలో తానేగొప్పవాడను అనేభావనతో విపరీతమైన గర్వం కలిగింధి. తన సృష్టిలేనిచో విష్ణువునకూ శివుడికి నిర్వర్తించు విధులు ఉండవని అన్నబ్రహ్మ వాక్కులు బ్రహ్మకు విధేయులైనవారు పొగడగా బ్రహ్మగర్వంతో నున్నపుడు విష్ణువు బ్రహ్మతో త్రిమూర్తులందు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువఅనే భేదభావం ఉండదని ముగ్గురూ సమానమని సర్థిచెప్పినాడు. కానీ విష్ణువు బ్రహ్మను ఒప్పించ లేకపోయాడు మరియు వేరే మార్గం లేనందున బ్రహ్మ గొప్పవాడని అంగీకరించాడు.
బ్రహ్మ విజయగర్వంతో కైలాసానికివెళ్లి త్రిమూర్తుల్లో తానేగొప్పవాడని శివునితో వాదనకుదిగగా శివుడు బ్రహ్మతో త్రిమూర్తులందు ఎక్కువ, తక్కువఅన్నభేదంఉండదని ఒప్పించాడు. బ్రహ్మ ఐదోశిరస్సులోమాత్రం తానుగొప్పవాడని తలవడం శివుడు పసిగట్టి, ఆఆలోచనఆలాగే కొనసాగితే సృష్టి అల్లకల్లోలం ఆవుతుందని భావించి తనత్రిశూలంతో బ్రహ్మ ఐదోశిరస్సును ఖండించివేశాడు. ఆశిరస్సు బద్రీనాథ్ పుణ్యక్షేత్రంఉలోఉన్న అలకనంద నదీతీరంలోపడి మోక్షం పొందిందని పురాణకథనం. పిమ్మటబ్రహ్మకు గర్వము తగ్గినదని పురాణకధనం. అదేబ్రహ్మకపాలం పేరుతో ప్రసిద్ధిచెందింది.
మరోకథనం ప్రకారం బ్రహ్మ మన్మథుడి తపస్సుకుమెచ్చి మూడుబాణములు బహూకరించి, అవి ప్రయోగింపబడిన వారికి శృంగార వాంచ పెరుగుతునని తెలిపాడు. పరీక్షకోసం మన్మథుడు ఒకబాణాన్ని బ్రహ్మపై ప్రయోగించగా.శృంగార భావాలుపెరిగి బ్రహ్మ తానుసృష్టించిన శతరూపఅనే అందమైనయువతిని మోహించి తన అయిదవ శిరస్సుతో ఆమె ఎక్కడికిపోయినా కామపుకోరికలతో చూస్తూఉండటంతో సృష్టికార్యం నిలిచిపోయింది. ఇదిగ్రహించిన శివుడు వీరభద్రుడిని సృష్టించి బ్రహ్మ ఐదోశిరస్సును ఖండించాల్సిందిగా ఆదేశించాడు. వీరభద్రుడు బ్రహ్మ ఐదవశిరస్సును ఖండించి ఆశిరస్సును బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దగ్గరగాఉన్న అలకనంద నదీతీరంలో విసిరివేశాడు. బ్రహ్మశిరస్సు పడినప్రాంతమే బ్రహ్మకపాలంగా పేరుపడ్డది. అలకనందలోపడిన బ్రహ్మశిరస్సునకు మోక్షముకలిగింది. పిమ్మట శివుడు బదరీనాధ్ నందు తపస్సుచేసి బదరీనాధుని పూజించి బ్రహ్మహత్యా పాతకమునుండి విముక్తుడైనాడు. బ్రహ్మకు కపాలమోక్షం జరిగిన ప్రదేశం కావున ఈ ప్రదేశం బ్రహ్మకపాలం అని ఇచ్చట పిండప్రధానం చేసిన జీవులకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుండని పురాణములందు చెప్పబడింది.
మాతృగయగా ప్రసిద్ధిచెందిన సిద్దాపూర్ నందు హిందువులచే పవిత్రగ్రంధముగా పరిగణించబడుచున్న ఋగ్వేడంలో ప్రస్తావించబడి
భాగవతంనందు పవిత్రంగా పేర్కొనబడిన పంచసరోవరాలైన మానససరోవరం, బిందుసరోవరం, నారాయణసరోవరం, పంపాసరోవరం మరియు పుష్కరసరోవరం లందు ఒకటిఅయిన బిందుసరోవర్ సరోవరంఉన్నది. మాతృశ్రార్ధం మరియు ఉత్తరఖర్మలు జరుపు ప్రదేశం ఆగుటవలన మాతృగయగా ప్రసిద్ధిచెందింది. దేశము నలుమూలలనుండి వేలసంఖ్యలో ప్రజలు మరణించిన తమతల్లికి ఉత్తరఖర్మలు జరిపించుటకు, పిండప్రధానంచేయుటకు కార్తీకమాసం (అక్టోబరు, నవంబరునెలలలో) సిద్ధాపూర్ సందర్శించెదరు. కపిలమహర్షి తల్లి దేవహుతి కుమారుడు ఇచ్చిన సూచనలు పాటించి తనమనస్సులోని లోపములు అన్నియు తొలగించుకోని భగవంతుని ఆనుగ్రహంతో శరీరము వదలివేయగా ఆశరీరము గ్యానవాపి పేరుతో ఇచ్చట ఒకపవిత్ర నదిగామారినది. ఈరోజునకు కూడా ఋషులు తమను శుద్ధి చేసుకొనుటకు అదృశ్యముగా ఈనదినందు స్నానంచేయదురని నమ్ముతారు.
పిండప్రధానం చేయు బిందుసరోవరం బిందువులతో ఏర్పాటుకాబడిన సరస్సు. మహావిష్ణువుని కన్నీటిబిందువు సరోవరంయందు పడినదని నమ్ముతారు. పరశురాముడు తనతల్లికి పిండప్రధానం ఇచ్చటనే బిందుసరోవర్ గట్టుపైచేసినాడు. పరశురాముని ఆలయము ఇచట నిర్మింఛారు. ఈప్రదేశం కపిలమహర్షి తపోస్థలము మరియు ఆతనితల్లికి మోక్షజ్ఞానము భోధించిన స్థలము. ఆకారణమున దేశములోని యాత్రికులు వారితల్లికి ఇచట పిండప్రధానం చేయవలెనని తలచెదరు బ్రహ్మకపాలం, గయ, నాభిగయ మరియు పాడగయలందు పితృ, మాతృవంశములోనివారికి అందరికీ పిండప్రధానం చేయవచ్చును. గుజరాత్ రాష్ట్రంనందలి సిద్ధాపూర్ లోని బిందుసరోవరంవద్ద కేవలం మాతృవంశంలోని వారికేమాత్రమే పిండప్రధానంచేసి మాతృఋణం తీర్చుకొనుటకు దేశంనలుమూలలనుండి వేలాదిగా ప్రజలువచ్చి మాతృశార్ధ కార్యక్రమములు జరిపెదరు.
గయాక్షేత్ర పిండప్రధానం పితృదేవతలకు ముక్తిప్రధం
IPLTOURS – Indian Pilgrim Tours