ముక్తినాధ్ & పశుపతినాధ్ యాత్ర
(IPLTOURS)
హిమాలయన్ యాత్ర పురస్కరించుకొని హరిద్వార్ వద్ద ఆగి ఆచటి నుండి మరలా ముక్తినాథ్ ద్వారా పశుపతినాధ్ దర్శించుటకు ప్రయాణము ఆరంభించవలెను.
ముక్తినాథ్
ముక్తినాథ్ ను ముక్తి క్షేత్రము అని పిలిచెదరు. ఈ విశిష్ణ క్షేత్రము నేపాల్ లోని ముస్తాఙ్గ్ వద్ద తోరోంగ్ లా పర్వత పాదము వద్ద ముక్తినాథ్ లోయవద్ద నున్నది. ఈ ఆలయము హిందువులకే కాక బౌద్ధులకు కూడా పరమ పుణ్య క్షేత్రము. సముద్ర మట్టమునకు 3800 మీటర్ల ఎత్తులో నిర్మించబడిన ఈ ఆలయము ప్రపంచములో ఎత్తైన ప్రదేశములో నిర్మించబడిన క్షేత్రములలో ఒకటి. ఈ క్షేత్రము ముక్తినాధ్ గా పిలువబడు రాణిపౌవా గ్రామమునకు అతి సమీపములో నున్నది. ఈ ఆలయము విష్ణువుయకు సంబంధించిన 108 దివ్యదేశములలో 106వ దివ్యక్షేత్రము. ఈ ఆలయము ముందుగా విష్ణు క్షేత్రమైనను దర్మిలా గురు పద్మసంభవుడు ఇచట కొంత కాలము ధ్యానము చేయుట వలన ఇది బౌద్ధులకు కూడా దివ్యక్షేత్రము అయినది.
పశుపతినాధ్
పశుపతినాధ్ దేవాలయము సుమారు 2400 సంవత్సరాల ముందు నుండి ఉన్నటువంటి అతి పురాతనమైన హిందూ దేవాలయము. ఖాట్మండూ పట్టణమునకుతూర్పు దిక్కున ఈశాన్యముగా భాగమతినదీ తీరమున ప్రశస్తమైన మరియు పవిత్రమైన ఈ పశుపతినాధ్ ఆలయ సముదాయము ఉన్నది. ఈ దేవాలయ సముదాయము వివిధ ఆలయముల తోనూ ఆశ్రమముల తోనూ కూడి నాగరికత వెళ్ళి విరియు ప్రదేశము. పశుపతిగా ఇచట మూల విరాట్టు ప్రసిద్ధుడు. శివుడు పార్వతి ఖాట్మండు లోయకు భాగమతి నదీ తీరమునందు విశ్రాంతి తీసుకొనుటకు వచ్చి. ఆచటి ఆటవీ ప్రాంతము నందలి ప్రకృతి సౌందర్యమునకు ముగ్ధులై లేళ్ళ రూపము ధరించి విహరించ సాగారు.