మహాలయ పక్ష & శ్రద్ధ కర్మ
(IPLTOURS)
(IPLTOURS)
ప్రతి సంవత్సరం చంద్రమానం ప్రకారం, పితృపక్షం లేదా మహాలయపక్షం భాద్రపద బహుళపక్ష ప్రతిపత్తి (పాడ్యమి) నాడు ప్రారంభమై బహుళ అమావాస్యతో ముగుస్తుంది. పితృపక్షంనందు పిండప్రధానం స్వగృహములో చేసుకొనవచ్చును. పుణ్యక్షేత్రములలో చేయు అభిలాష ఉన్నవారు వారణాశి (కాశీ), గయ, ప్రయాగ రాజ్ క్షేత్రములందు నిర్వహించుటకు వీలుగా క్షేత్రములలో లభ్యమగు వివిధ సౌకర్యాల వివరాలు తెలియచేయు చున్నాము.
మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అతిధి దేవోభవ అన్న నానుడియందు జన్మనిచ్చినతల్లితండ్రులు, విధ్యనేర్పీన గురువు మరియు స్నేహితుల ఋణంతీర్చుకొనే అవకాశం వారికిసద్గతులు కలిగించు అవకాశం మానవజన్మనందే సాధ్యం. శాస్త ప్రకారం మరణించినవారి కుమారులు, జామాత (కుమార్తె భర్త), దౌహిత్రుడు (కుమార్తెయొక్క కుమారుడు), బ్రాహ్మణుడు వరుస క్రమంలో లభ్యతనుబట్టి సంవత్సరవారి ఖర్మలు మహాలయాపక్షములో పిండప్రధానం చేయుటవల్ల వారిఆత్మలకు సద్గతులు కలుగ జేసి వారి దీవనలతో సుఖసంతోషాలు పొందవచ్చును. తల్లితండ్రుల మరియు పూర్వీకుల ఆత్మలు ముక్తిపొందుటకు పితృ ముక్తిక్షేత్రాలుగా పరిగణించు పంచ (ఐదు) గయా క్షేత్రాలైన శిరోగయ (బీహార్), నాభి గయ (ఒరిస్సా), పాద గయ (ఆంధ్రప్రదేశ్), మాతృ గయ (సిద్ధాపూర్, గుజరాత్) మరియు బ్రహ్మకపాల్ (బద్రీనాథ్)లలో పిండప్రధానం చేయవలసి ఉంది. అన్నిక్షేత్రములు దర్శించలేనివారు పుణ్య క్షేత్రములైన కాశీ (వారణాశి), గయ మరియు ప్రయాగలందు పిండప్రధానం చేయడంవల్ల వారిఆత్మలకు ముక్తి కలుగుతుంది.
పురాణమలందు తెలిపిన ప్రకారం శ్రాద్ధకర్మకానీ పిండప్రధానం చేయుటకుగాని అర్హతకల కర్త అనగా కుమారుడు, దౌహిత్రుడు అభ్యం కానప్పుడు శోత్రియ బ్రాహ్మణుని నియోగించి వారిద్వారా శ్రాద్ధకర్మ మరియు పిండప్రధానం చేయించు ఏర్పాటు కొన్ని సత్రములందు మరియు ఆశ్రమములందు లభ్యం. అంతేకాక విదేశములలో నుండి పితృకర్మలు చేయుటలో లేదా చేయించు కొనుటపట్ల ఆశక్తి ఉన్నవారికి లేదా పితృకర్మ చేయుటకు ఆశక్తిఉన్ననూ శారీరక ధృఢత్వం లేక చేయలేనివారికి శాస్త్రంలో తెలిపినట్లు ప్రత్యామ్నాయంగా శోత్రియ బ్రాహ్మణునితో వారిస్థానే ఆబ్దీక, పిండప్రధానాది కార్యక్రమములు నిర్వర్తించుచూ Live telecast చేయు సదుపాయం ఉన్నది.
అశౌచకర్మలైన వైదిక కర్మలు, శ్రాద్ధకర్మలు, పిండప్రధానం తదితర కార్యక్రమాలకు వంశంలో గత మూడు తరముల గోత్ర నామములు (బ్రాహ్మణులలో ప్రవర) అవసరమై ఉన్నవి. గతంలో ఉమ్మడి కుటుంభాలు మరియు గ్రామాల్లో నివసించడంవల్ల తమకు తెలియని పూర్వీకుల సమాచారం పెద్దలనడిగి తెలుసుకొనే వెసులుబాటు ఉండెడిది. కాలంమారి ప్రస్తుత తరంవారు విద్యాభ్యాసంవల్ల భుక్తికొసం ఉద్యోగాలు చేయడంవల్ల పట్టణాలు, విదేశాలు వలసవెళ్ళుటవల్ల తమవారికి దూరమై కనీసం తమవారు ఎవరు తమగోత్రం ఏమిటి అనే వివరాలుకూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. శుభకార్యములైన ఉపనయనం, వివాహాది క్రతువులు అశుభకార్యములైన వైదికకర్మలు, శ్రాద్ధకర్మలు, పిండప్రధానం తదితర కార్యక్రమాలకు కూడా వంశములో మూడుతరముల వారి గోత్రనామములు, ప్రవర తదితరముల ఆవశ్యకత ఉంది. సాధారణంగా అధికభాగం తమ తాతలపేర్లు గోత్రం చెప్పలేని స్థితిలో ఉన్నారు. బ్రాహ్మణులలో చాలామందికి తమ ప్రవర తెలియయదు అనడంలో ఆశ్చర్యం లేదు.
వీక్షకుల సౌలభ్యముకొరకు పితృవర్గ సమాచార సేకరణకు పట్టిక నిచ్చుచున్నాము. నగరాలు మరియు విదేశాలలో ఉద్యోగ రీత్యా నివసిస్తున్నవారు శ్రద్ధవహించి, అవసరమైన సమాచారాన్ని తమ కుటుంభపెద్దలను బంధువులనుండి సేకరించుకొని మరణించిన వారికి మహాలయాపక్షములలో పిండప్రధానం మరియు శ్రాద్ధకర్మలు పుణ్యక్షేత్రములైన కాశీ, గయ మరియు ప్రయాగలలో నిర్వహించి పూర్వీకుల ఆత్మలకు ముక్తికలిగించి వారిదీవనలతో అభివృద్ధి చెండాలని మరియు దేశ విదేశాల్లో నివసిస్తూ దైవం మరియు భక్తుల సేవనందు ఆశక్తి కలవారు కాశీలో చేయు పాప పుణ్యములు రెండునూ కోటిరెట్ల ఫలితం ఇచ్చునని పురాణములందు తేలుపబడి నందువల్ల వారి పూర్వీకులకు పిండప్రధానం చేయుటతో పాటుగా సత్రములకు, ఆశ్రమములకు విరాళముల నిచ్చుటద్వారా ఆర్ధిక పరిపుష్టి కలిగించి వారి సేవలో పాలు పంచుకొనగలరని ఆశిస్తున్నాం. మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను పూజించడం, తర్పణం చేయడం వల్ల స్వర్గానికి చేరుకోలేక భూలోకంలో సంచరిస్తున్న పూర్వీకుల ఆత్మలు కర్మకాండలతో సంతృప్తి చెంది మోక్షాన్ని పొందుతాయి. డబ్బు, ఆరోగ్యం, సత్సంబంధాలు మరియు వృత్తికిచెందిన సమస్యలు పిండ ప్రధానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదంతో పరిష్కరించబడతాయి. శ్రాద్ధకర్మను ఆచరించేవాడు అదృష్టాన్ని మరియు సుసంపన్నమైన జీవితాన్ని పొందగలడు. అంతేకాక ఇదివరలో తర్పణం చేయకపోవడంవల్ల కలిగే చెడుకర్మలు తొలగిపోతాయి. పూర్వీకులు చేసినపాపాలు తొలగిపోయి, శ్రాద్ధకర్మను ఆచరించేవారికి అన్నింటిలో విజయం చేకూరుతుంది.
బెంగాల్ నందు మహాలయపక్షం దుర్గాపూజ ఉత్సవాలరోజు అనగా దుర్గాదేవి భూమిపై అవతరించిన అశ్వీయుజ శుద్ద పాడ్యమినాడు ప్రారంభమౌతుంది. మహాలయ పక్షములో బెంగాలీ ప్రజలు తెల్లవారుజామున మేల్కొని సాంప్రదాయకంగా దేవీమహాత్యం నుండి శ్లోకాలను పఠించి పూర్వీకులను ఇండ్లలోనూ తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మండపములందు ఆర్చిస్తారు.
IPLTOURS – Indian Pilgrim Tours