సోమనాధ్ యాత్రనందు యాత్రికులు ఉత్తర పశ్చిమభాగమునఉన్న శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన పవిత్ర పుణ్యక్షేత్రములు దర్శించవచ్చును. క్షేత్రములన్నియు అరేబియా సముద్ర తీరమునఉన్న ద్వాదశ జ్యోతిర్లింగములలో మొదటిడైన సోమనాధ్ జ్యోతిర్లింగ క్షేత్రంతో ప్రారంభమై సోమనాధ్ నందు సోమనాధ్ జ్యోతిర్లింగ దర్శనముతో పాటుగా మొగలాయిల దాడులంధు పాక్షికంగా ధ్వంశమైననూ సురక్షితంగాఉన్న జ్యోతిర్లింగం మరియు ఆలయముభాగము నూతన ఆలయమునను మరియు సముద్రతీరమందు, సముద్రములోనూ శివలింగములు, బాణస్తంభం దర్శించవచ్చును.
సోమనాధ్ నుండి 5 కి.మీ. దూరములోనున్న వారెవాల్ నందు శ్రీ కృష్ణుడు నిర్యాణంచెందిన ప్రదేశం మరియు బలరాముడు ప్రవేశించి అదృశ్యమైన బలరామ (బలదేవ) గృహ చూడవచ్చును. పిమ్మట సోమనాథ్ నకు సుమారు 80కిలోమీటర్ల దూరములో గంగేశ్వరమహదేవ్ ఆలయం దర్శించి, బావనగర్ప్ర యాణించి అచ్చటికి 23 కి.మీ. ప్రయాణించి నిష్కలంకమహాదేవ్ దర్శించి తిరిగి సోమనాధ్ చేరవలసి ఉంటుంది.
సోమనాధ్ నుండి ద్వారకచేరుకొని ద్వారకాదీశుని మరియు సముద్రంలోఉన్న బెట్ ద్వారక దర్శించి, ద్వారకనుండి 12 జ్యోతిరింగములలో 8వ జ్యోతిర్లింగమైన నాగనాధ్ జ్యోతిర్లింగం దర్శించి సోమనాధ్ చేరవలయును. సోమనాధ్ నుండి రోడ్డు మార్గంలో పంచద్వారక క్షేత్రములలో ద్వారక, బెట్ ద్వారక మినహా మిగినిన దాకోర్, కన్ క్రోలి మరియు నాథ్ ద్వారా కృష్ణ క్షేత్రములు దర్శించి సోమనాధ్ చేరవలయును. సోమనాధ్ నుండి అహమ్మదాబాద్, అహమ్మదాబాద్ నుండి సుమారు 100 కిలో మీటర్ల దూరములోనున్న సిద్ధాపూర్ చేరుకొని మాతృగయ నందు గతించిన మాతృవంశములోనివారికి పిండప్రధానం చేయవచ్చును.
పితృ మరియు మాతృవంశముల లోనివార్కి వారు ఉత్తమగతులు పొందుటకు పిండప్రధాన కార్యక్రమాలు గయ, ప్రయాగ, వారణాశి, జాజిపూర్, పాడగయ మరియు బ్రహ్మకపాల క్షేత్రములున్ననూ మాతృవంశమువారికి మాత్రమే సిద్ధాపూర్ నందుకల మాతృగయలో పిండప్రధానం చేయవలసి ఉన్నది. సిద్ధాపూర్ నందు మాతృగయనందు కార్యక్రమములు ముగుంచుకొని అహమ్మదాబాద్ చేరి స్వస్థలం చేరవచ్చును.
ఈయాత్రనందు యాత్రికులు సోమనాధ్, నాగేశ్వర్, నిస్కలంక మహదేవ్, గంగేశ్వరమహదేవ్ శివక్షేత్రములు దర్శించుటతోపాటు దివ్యక్షేత్రములైన పంచద్వారకలు మరియు మాతృగయ సందర్శనం చేయవచ్చును. యాత్రనందు అహమ్మదాబాద్, సొమనాధ్, ద్వారక లందు మధ్యతరహా మరియు ఉన్నతశ్రేణి హోటల్స్ లభ్యం. యాత్రనందు చాలాభాగం రైలుద్వారాను, నిష్కలంక మహదేవ్, గాంగేశ్వరామహదేవ్, నాగనాధ్ తదితరక్షేత్రములు రోడ్డుమార్గంద్వారా ప్రబ్యానించవలసి ఉంటుంది. యాత్రకు సుమారుగా ఒక్కొ వ్యక్తికి రూ 30,000/ వరకు ఖర్చుకాగలదు.
సోమనాథ్
వారెవాల్
నిష్కలంక్ మహాదేవ్
గంగేశ్వర మహాదేవ్
శ్రీ ద్వార్కదిష్ ఆలయం
నాగనాథ్
ఉజ్జయిని
ఓంకారేశ్వర్
శివకేశవ దర్శనం మోక్షప్రదం
IPLTOURS – Indian Pilgrim Tours