స్వర్గపు ద్వారాలు తెరుచుకున్నాయి
చార్ ధామ్ అంటే శ్రీహరి నివసించు నాలుగు స్వయంభూః క్షేత్రములు. జగద్గురు ఆదిశంకరాచార్యులవారు బదరీనాధ్, జగన్నాధ్ రామనాధ్ (రామేశ్వరం) మరియు ద్వారకాదీష్ ఆలయాలు చార్ ధామ్ అని, ఈక్షేత్రముల దర్శనం మోక్షంపొందు మార్గమని ప్రవచించారు. దక్షణ ప్రాంతంవారు ద్వారకాదీష్, బదరీనాధ్, జగన్నాధ్ మరియు రామనాధ్, ఉత్తరప్రాంతంవారు బదరీనాధ్, జగన్నాధ్, రామనాధ్ మరియు ద్వారకాదీష్వ రుసగా దర్శించి యాత్ర ఒకేపర్యాయంలో చేయవచ్చు. శివకేశవులు ఒక్కరేఅని నాలుగు క్షేత్రముల దర్శనం మధ్యలోనున్న అన్ని శైవ, వైష్ణవ క్షేత్రములు దర్శించినట్లే అని పురాణాలు మరియు స్థానిక కధనములు చెప్తాయి. వాడుకలో గంగోత్రి, యమునొత్రి, కేదార్నాథ్ మరియు బదరీనాధ్ క్షేత్రములు చార్ ధామ్ అనిప్రాచుర్యంలోకి వచ్చింది. నాలుగు క్షేత్రములు వరుసగాఉండి రోడ్డుమార్గం ద్వారాకానీ హెలీకాప్టర్ నందుకానీ ప్రయాణించవచ్చును. హేలీ కాప్టర్ ప్రయాణమునకు ఒక్కొక్కరికి సుమారుగా లక్షా ఎనభైవేల రూపాయలు ఖర్చుకాగలదు.
రోడ్డుప్రయాణమునకు సుమారుగా 50 నుండి 60 వేలరూపాయలు ఒక్కొక్కరికి ఖర్చుఅగునాని అంచనా వేయుచున్నాము. హెలీకాప్టర్ లో నాలుగుక్షేత్రములే దర్శించు అవకాశముండగా రోడ్డుమార్గంలో ప్రయాణించిన మార్గమధ్యములో కల ప్రముఖక్షేత్రములు ఆలయములు దర్శించచ్చును. పుణ్యక్షేత్రాలతో పాటు సందర్శించాల్సిన ఆలయాలు, ఇతర పుణ్యక్షేత్రాల వివరాలను అందించియున్నాము. వివరములు అన్నియు పరిశీలించిన యాత్ర చేయునప్పుడు ఎన్ని ఆలయముల దర్శనం చేయలేక పోవుచున్నామో పాఠకులకు తెలియును.
చార్ ధామ్ యాత్రలో గంగోత్రి, యమునొత్రి, కేదార్నాధ్ మరియు బద్రినాధ్ లతోపాటుగా హరిద్వార్, ఋషీకేశ్, ఉత్తరాక్షి, దేవ ప్రయాగ, రుద్రప్రయాగ, గుప్తకాశీ, గౌరీకుంద్, సొన ప్రయాగ, కర్ణప్రయాగ, విష్ణుప్రయాగ, జోషీమత్, హనుమాన్ చత్తి క్షేత్రములు దర్శించుటకు అనువుగా సికింద్రాబాదు నుండి 20 రోజుల వ్యవధి తగినంత విరామంతో యాత్రా విధానం పోస్ట్ చేయుచున్నాము. వివిధ క్షేత్రాల బదరీ కేదార్ ఆలయ కమిటీ యొక్క అతిథి గృహాల సమాచారంకూడా అందించుచున్నాము. యాత్రనందు గంగోత్రి మరియు యమునొత్రి ట్రెక్కింగ్ వలన దర్శించలేకపోయిన ఆక్షేత్రములకు బదులుగా కర్ణప్రయాగ మరియు జోషీమఠ్ వద్దనున్న పంచబడర్రి క్షేత్రములలో యోగధన్ బద్రి, భవిష్య బద్రి, వృద్ధ బద్రి మరియు ఆది బద్రి క్షేత్రములు బద్రినాధ్ తోపాటు దర్శించవచ్చును.
యాత్రికులు ఎనిమిదిమంది బృందముగా యాత్రచేసిన సమన్వయంతో శులభంగా యాత్ర చేయుటకు అనువుగా ఉంటుంది. కేదార్నాధ్ నడవలేనివారు హెలెకాప్టర్ నందు గుప్తకాశీ నుండి కేదార్నాడ్ తిరిగి గుప్తకాశీచేరీ యాత్ర కొనసాగించవచ్చును. ఇతర క్షేత్రములకు రోడ్డు సదుపాయం ఉంది మరియు ఏ వయసు వారైనా హాయిగా ప్రయాణించవచ్చు.
ఋషికేశ్ దాటినపిమ్మట క్షేత్రాల్లో ఆహార సదుపాయాలు తగినంతగా లభ్యముకావు. ప్రయాణీకుల సమూహాలు వారి బసలో స్వంత భోజనాన్ని తయారు చేసుకోవడానికి వారితో పాటు వంటసామాను మరియు తినుబండారాలను తీసుకువెళ్లవచ్చు.
యాత్రనందు బార్కోడ్ నుండి యమునొత్రికి సుమారు 7 కి.మీ. గంగోత్రి పుట్టిన ప్రదేశము 14 కి.మీ గోముఖ్ చేరడానికి పర్వతమార్గం నందు నడక లేదా గుర్రం లేదా డోలీమీద ప్రయాణించవలసి ఉంటుంది. గంగోత్రి మరియు యమునొత్రికి ప్రత్యేకంగా హెలీకాప్టర్ సౌకర్యం లేదు. చార్ ధామ్ పాకేజీలో మాత్రమే అట్టిసౌకర్యం ఉన్నది. కేదారనాధ్ సుమారు 14 కి.మీ నడక/గుర్రం/డోలీ ప్రయాణమైననూ హెలీ కోప్టర్ సౌకర్యం గుర్రం/డోలీ ప్రయాణపు ఖర్చుకు దగ్గరలోనే ఉంటుంది. కేదార్నాధ్ ఒక్కక్షేత్రముకు మాత్రమే హెలీకోప్టర్ వినియోగించు కొను అవకాశంన్నది వేసవి కాలమందు సాధారణ దుస్తులు వర్షాకాలము శీతాకాల ప్రారంభము అనగా ఆలయములు మూవేయుటకు ముందుగా జర్కిన్ లేదా ఉన్నిదుస్తులు, మంకీ కాప్, కాళ్ళకు బూట్లతో పాటు తాము నిత్యం ఉపయోగిండు మందులు రొంప, ఒళ్ళు నెప్పులు, మోషన్ మాత్రలు ,బాండెయిడ్ ప్లాస్టర్లు తదితర ప్రధమ చికిత్సకు అవసరమగు మందులుకూడా తీసుకువెళ్ళడం శ్రేయస్కరం.
ఫేస్ బుక్ వీక్షకుల సౌకర్యార్ధం చార్ ధామ్ యాత్రనందు యాత్రికులు బస చేయుటకు బదరీకేదార్ టెంపల్ కమిటీ పేరుతో ఉత్తరాఖండ్ ప్రభుత్వమువారు వివిధ ప్రాంతములలో నిర్మించిన వసతిగృహముల వివరములు ఇస్తున్నాము. ఫేస్ బుక్ వీక్షకుల సౌకర్యార్ధం చార్ ధామ్ యాత్రనందు సందర్శించవలసిన ఆలయములు మరియు పవిత్ర ప్రదేశముల వివరములు స్థానిక కధనములతో ప్రచురించి యున్నాము. ఎనిమిదిమంది యాత్రికులు గ్రూపుగా ప్రయాణించిన సౌకర్యంగా యాత్రచేయవచ్చునని మరోమారు తెలియజేయుచున్నాం.
గతంలో చార్ ధామ్ యాత్రనందలి క్షేత్రములపై క్షేత్రమునందుకల ఆలయముల స్థానిక కధనములు మరియు పురాణకధలతో మేము ప్రచురించిన మా పోస్టులు దర్శించగోరువారు మా ఫేస్బుక్ పేజీ – https://www.facebook.com/ipltours/ సందర్శించ కోరుచున్నాము. మావీడియోలు గూగుల్ ఎకౌంటుతో మా youtube ఛానల్ – https://www.youtube.com/c/IPLTours ఓపెన్ చేసిచూసి subscribe చేసి చూడండి.
హరిద్వార్
ఋషికేశ్
ఉత్తరకాశీ
గంగోత్రి
యమునోత్రి
దేవ్ ప్రయాగ
కేదార్నాథ్
కర్ణ ప్రయాగ
జోషిమత్
విష్ణు ప్రయాగ
హనుమాన్ చట్టి
బద్రీనాథ్
క్షేత్ర పురాణం తెలుసుకొంనండి సుఖవంత ప్రయాణం చేయండి
IPLTOURS – Indian Pilgrim Tours