క్రోధ నృసింహ
(IPLTOURS)
అహోబిలమునందున్న నవనృసింహక్షేత్రములలో క్రోధనృసింహక్షేత్రము ఒకటి మరియు వేదాద్రి గరుడాద్రి కొందలనడుమ ఉన్న ఈక్షేత్రము నవనృసింహక్షేత్రములలో జ్వాలానృసింహ, మాలోలనృసింహతరువాత ఎక్కువఎత్తులోఉన్నది. దీనిని సిద్ధక్షేత్రమనికూడా పిలిచేదరు. లక్ష్మీసమేత క్రోధాకారనృసింహుడు ఒకతొలిచినరాయినడుమ గృహవంటిప్రదేశమునందు కొలువుతీరిఉన్నాడు. ఎగువ అహోబిలమునుండి సుమారు 2 కి.మీ దూరములో ఉన్నది. అహోబిలంమఠం ప్రధమజీయర్ స్వామిచే ఇచట మఠాధిపతులకు శ్రీభాష్యం వివరించుచూ భగవద్గీత ఉపదేశించినారు.
బ్రహ్మ హిరణ్యకశిపునికి పగలుకాని రాత్రికాని, ఇంట్లోకాని బయటకాని, నేలపైకానీ ఆకాశమందుకానీ, దేవతలవలనకానీ, రాక్షసులవలనకానీ, మనిషి వల్లకానీ, జంతువువల్లకానీ, ఎటువంటి ఆయుధముతోకానీ చావులేకుండావరం ఇచ్చాడు.
అందువలననే నారాయణుడు సంధ్యాసమయంలో ఇంటిగడపపై సగముమనిషి సగముసింహరూపములో నృసింహ ఆవతారములో హిరణ్యకశిపుని తనతొడలపై ఉంచుకొని చేతివేళ్ళకుగల గోరులతో హిరణ్యశిపుని ఉదరముచీల్చి ప్రేగులను మెడలో దండవలెధరించి అతిభయానకముగా సంహరించినాడు. హిరణ్యకశిపుని వధించిన పిమ్మట నృసింహుడు హిరణ్యకశిపునికి వరముఇచ్చిన బ్రహ్మపై చాలాకోపమువహించినాడు. బ్రహ్మను తనఎదుటకురమ్మని ఆదేశించగా బ్రహ్మ నృసింహునివద్ధకు వచ్చుటకు భయపడినాడు.
ఆసమయములో వేదములు బ్రహ్మచేతినుండి జారిక్రిందపడినవి. భూదేవి వాటినిక్రింద పడకుండాపట్టి తనతోపాటు సంరక్షించుటకు పాతాళలోకమునకు తీసుకొనివెళిపోయినది. వేదములు లేకపోవుటవలన క్రోధాకార అడవిపంది ముఖకవలికలు మరియు కోరలతో (పళ్లతో), సింహపుతోకతో నున్న నృసింహుని దేవతలు దర్శించి వేదములు తెచ్చుటకు పాతాళమునకు వెళ్ళినారు. నృసింహుడు తనకోరలతో భూదేవిని ధరించి వేదములను సంరక్షించినాడు. వేదములను తెచ్చినపిమ్మట నృసింహుడు ఈక్షేత్రములో క్రోధనృసింహుని రూపములో కూర్చొనినాడు. బ్రహ్మఅప్పుడు నృసింహుని వద్దకువచ్చి తనను క్షమించి వేదములను తిరిగఈయమని కొరివాడు. నృసింహుడు అందుకు తిరస్కరించుచూ వేదములను బ్రహ్మ పోగొట్టినందున ఆయనకు తిరిగిఈయనని కానీ బ్రహ్మసూచించినవారికి ఇచ్చేదనని తెలుపగా బ్రహ్మ లక్ష్మీదేవికిఈయమని కోరినాడు. అందుకు అంగీకరించి మాలోలనృసింహుని రూపములో బ్రహ్మకు దర్శనము ఇచ్చినాడు.
భాగవత పౌరాణికముప్రకారము సోమకాసురుడు అనురాక్షసుడు బ్రహ్మనుండి వేదములను తస్కరించి సముద్రములో దాగినాడు. శ్రేమన్నారాయణుడు వరాహరూపములో అవతరించి భూమిపైకితనకోరలపై ఉంచుకొని సోమకాసురుని సంహరించి వేదములను కాపాడినాడుఅని నానుడి.ఆలయమండలి ప్రధాన దైవము క్రోధాకార (వరాహ) నృసింహస్వామి అడవిపంది ముఖకవళలికలు మరియు కోరలు, సింహపుతోక మరియు రెండుచేతులుకల మనిషిశరీరముతో భార్యలక్ష్మీదేవిని శాంతింపచేయుచూ దర్శనంఇస్తాడు. నృసింహుడు చెంచులక్ష్మితో సాన్నిహిత్యము పెరుగుటవలన లక్ష్మీదేవికి కోపము వచ్చినప్పుడు ఆమెను శాంతపరచినాడు. ఇచ్చటనే వరాహతీర్ధము ఉన్నది. ఎగువ అహోబిలకునుండి 2 కి.మీ భవనాశిని నదీప్రవాహము వెంబడినడచి ఈక్షేత్రము చేరవచ్చును. మరియు ఈక్షేత్రము అయిదురోజులువరుసగా దర్శనముచేసుకొని స్వామిని అర్చించిన కోరినకోరికలు తీరుననినమ్మకం. వరాహ నృసింహ ఆలయమునందు ఈ దిగువమంత్రములిఖించబడి యున్నది.
“నమో నృసింహాయ నమః “ లేదా “నమో లక్ష్మీ నృసింహాయ నమః” ఈ నామ మంత్రమును సుఖాసీనులై కూర్చొని, కళ్ళు మూసుకొని, నాలుక మరియు పెదవులను కదలించకుండా 10 నుండి 30 నిమిషములు సులభముగా, సహజముగా మనస్సులోనే మననము చేయ వలెను. ఇదియే అంతరాత్మతో చేయు శ్రేస్టమైన పరమాత్ముని ధ్యానము. ధ్యానములో అన్యఆలోచనలు వచ్చినను చింతించక, వదలక ధ్యానమును పూర్తి చేయవలెను. ఎప్పుడైనాను, ఎక్కడైనను అనుకూలసమయములో ధ్యానము చేయవచ్చును. సదా మననము చేయుచూ శుభఫలితములను పోందవచ్చును.
క్రోధాకార (వరాహ) నృసింహుడు రాహు గ్రహమునకు అధిపతి. జన్మకుండలిలో లేదా జాతకములో రాహువు నీచస్థితిలో ఉన్న శారీరక అనారోగ్యము, పెద్దలశాపములు, నిరాశ మున్నగుబాధలు కలుగజేయును. క్రోధాకార (వరాహ) నృసింహుని సేవించిన రాహుబాధలనుండి విముక్తి లభించును.
Photo Gallery
IPLTOURS – Indian Pilgrim Tours