శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం

(నందవరం)
(IPLTOURS)

చౌడేశ్వరిదేవి దేవాలయము యాగంటి నుండి నంధ్యాల వచ్చు మార్గములో యాగంటి నుండి బనగానపల్లి మీదుగా  నందవరంనందు 21 కి.మీ దూరములోనూ నంద్యాలనుండి  32 కి.మీ దూరములో నున్నది. యీదేవాలయమునకు సంబంధించి పురాణకధనము అందుబాటులోఉన్నది. చౌడేశ్వరిదేవి కాశీవిశాలాక్షి అనునది నానుడి.               

పురాణముల ప్రకారము చంద్రవంశములోని పాండు రాజు తరువాత వరుసగా కిరీటి (అర్జునుడు), అభిమన్యు, పరీక్షిత్, జనమేజయ, శతానిక, ధానవ, అశ్వమేధ దత్త, క్షేమేంద్ర, సోమేంద్ర చంద్రవంశములోనివారు. వీరందరూ ఉత్తరాదిలో హస్తినాపురం కేంద్రముగా రాజ్య పాలన చేసినారు. వీరి పిమ్మట ఉత్తుంగ భూజుడు ఉత్తరాదినుండి దక్షణాదివచ్చి ప్రస్తుత కర్ణాటక రాష్ట్రములోని హస్కోట తహశీల్ నందుకల నందగుడి కేంద్రముగా రాజ్యపాలన చేసినాడు. ప్రస్తుతము నల్లమలఅడవుల సమీపములోనున్న నందవరము ఉన్న భూభాగము ఆతని పాలనలోనిది. 

Entrance of nandavaram chowdeshwari devi temple

ఉత్తుంగ భూజుడు కుమారుడు నందుడు 16వ ఏటయువరాజుగా ప్రకటింప బడినాడు. ఉత్తుంగభోజుడు వానప్రస్తమునకు వెళ్ళినపిమ్మట నందుడు 1059 సంవత్సరములో ఈ నందవరము అనే ఆనందవరముతోకల రాజ్యమునకు రాజుఅయి పాలించినాడు. నందుడు తన రాజ్యములోని ఆనందవరమును నందవరముగా బ్రాహ్మణులకు దానముగా ఇచ్చినడని, ఆబ్రాహ్మణులు కాలగమనములో నందవారిక అని ప్రాచుర్యము లోనికి వచ్చితిరి.

నందుడు రాజ్యపాలన చేయు సమయములో సమీప నల్లమల అడవులలోని బిళనాయకుడు ఒకరోజు ఆస్థానానికివచ్చి శ్రేశైలం అడవులలోని పులులు తమపంటలు పాడుచేయుచూ పశువులను చంపుతున్నాయని ఫిర్యాదుచేయగా నందుడు అడవిలోనికి పులులనువేటాడడానికి వెళ్ళినాడు. అచట మల్లిఖార్జునస్వామి నందుడుఅనే మునిరూపములో దర్శనమిచ్చి నందునిపేరుతో వంశము ఆరంభమగునని శెలవిచ్చి అదృశ్యమైనాడు.             

ఒకనాడు దత్తాత్రేయుడు కలలోకివచ్చి మంత్రపాదుకలు అనుగ్రహించి ఆమంత్రపాదుకలతో ప్రతిరోజూ ప్రాతఃకాలమున కాశీవిశ్వేశ్వరుని విశాలక్షిని పూజించి రాజ్యపాలనచేయ నాదేశించియున్నారు. ఆతరహాలోనే రాత్రిఅందరూ నిద్రించిన పిమ్మట ప్రాతఃకాలమున కాశీవిశ్వేశ్వరుని విశాలక్షిని పూజించి నందవరంవచ్చి రాజ్యపాలన చేయసాగాడు. ఒకనాడు రాణిరాత్రి లేచిచూసి రాజు లేకపోవుటగమనించి మరునాడు ఉదయం నిలదీసింది. తాను ప్రతిరోజూ కాశీవెళ్ళి వచ్చు చున్నట్లు తెలిపినా నమ్మక తానుకూడా రాజుతో వచ్చేదనని కోరింది. రాజు ఆప్రకారమే ఆమెను తీసుకొని కాశీవెళ్ళగా అక్కడ ఆమె నెలసరికాగా మైలపడి పాదుకల మాహాత్యము అంతరించేను. అంతట రాజువిచారిస్తూండగా కాశీనందలి బ్రాహ్మణులు తమ తపోబలముచే పాడుకలకు ఒక్కసారి నందవరం పోవుటకు శక్తియిచ్చారు. రాజు వాళ్ళనికోరిక కోరుకోమనగా వారు తమకు అవసరము అయినప్పుడు కోరుకొనెదమని తెలిపారు. పిమ్మటరాజు నందవరం వెళ్లి పోయినాడు. కొంతకాలము గడచిన పిమ్మట కాశీలో క్షామము సంభవించగా బ్రాహ్మణులు నందవరంవచ్చి రాజుగారిని సహాయము చేయమనికోరగా తనవాగ్ధానము జ్నప్తిలేదని సాక్షముకోరినాడు. బ్రాహ్మణులు కాశీవిశాలాక్షిని వేడుకొనగా విశాలాక్షి కేవలము ఒక రాత్రి వ్యవధిలో సొరంగమార్గముద్వారా నందవరం ఒకేఒక రాత్రిలో వారణాశినుండి నుండివచ్చి రాజుగారికి ఆయన చేసిన వాగ్ధానము గురించి సాక్షముచెప్పినది. రాజు ఆమెను నందవరములో నివసించమనికోరగా ఆమె చౌడేశ్వరీరూపముతో నందవరములో వెలసినది.   

నందన చక్రవర్తిచే నిర్మించబడిన ఈఆలయములో ముందుగా ప్రతిష్టించబడిన అమ్మవారు అతి భయంకర రూపముతో ఉండేడిదని, మానవమాత్రులు ఆమె కనులలోని తేజస్సు చూడలేక గుండెపోటుతో మరణించినారని, అందువలన గర్భగృహము తలుపులు శాశ్వతముగా మూసివేసి మరియొక దేవి విగ్రహము అదే భంగిమలో పూర్వ విగ్రహము పోలి ఉండునట్లు భక్తులు భయపడకుండా తయారు చేసినారని ఆ విగ్రహమే ప్రస్తుతము ఆలయమందు ప్రస్తుతము కలదని తెలియుచున్నది. పూర్వ విగ్రహమున్న ప్రదేశములోనే ప్రస్తుత దేవి విగ్రహము ప్రతిస్ఠించినారు. ఆలయమునకు కుడివైపున మెట్లమార్గము ద్వారా అసలు గర్భగృహమునకు పోవుదారిఉన్ననూ ఎవరిని అనుమతించరు. అమ్మవారి ఎదురుగా కల శ్రీచక్రమునకు భక్తులు టికెట్టు తీసుకొని కుంకుమార్చన చేసుకొన వచ్చును. తొగటవీర క్షత్రియులకు చౌడేశ్వరిదేవి ఇలవేల్పు. ఈఆలయం బ్రాహ్మణులలో నందవారికశాఖవారికి వారికులదేవతగా ప్రాముఖ్యత వహిస్తుంది. నందవారిక లేదా నందవీరికశాఖ వారినుండి ఈఆలయమునకు పోషణ మరియు దానములు లభించును. వారు గర్భగుడిలోనికి నేరుగావెళ్ళి చౌడేశ్వరిదేవి పూజాచేయుటకు అనుమతికలవారు. నందవారికశాఖ వారు అమ్మవారికి చీర సమర్పించు ఆచారము కలదు.    

ఆలయము ఉ 5-30నుండి మ 1-00 వరకు తిరిగి 3 నుండి రాత్రి 8-30 వరకు తెరచి ఉంటుంది. ఆలయమునందు ఉచితాన్నదానము మరియు వసతి సదుపాయము కలదు. ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రము, ఆలయమునుచేర్చి నందవీరక నిత్యాన్నదాన సత్రము, బ్రాహ్మణ ఆన్నదాన సత్రము ఉన్నవి.   

IPLTOURS Indian Pilgrim Tours