యాగంటి

(IPLTOURS)

భారతదేశము దక్షణభాగమున పరమశివుని స్వయంభూః ఆలయములందు ప్రముఖమైనది యాగంటినందున్న ఉమామహేశ్వర ఆలయం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలుజిల్లాలో ప్రకృతిఒడిలో నల్లమల అడవులమధ్య కర్నూలుకు 100 కి.మీ. మరియు నంధ్యాలకు 53 కి.మీ దూరంలో యాగంటి గ్రామంలో ఉమామహేశ్వరస్వామి ఆలయం ఉన్నది. యాగంటి క్షేత్రమునకు దగ్గరలోనున్న రైల్వేస్తేషను నంధ్యాల. రాష్ట్రంలోని అన్నిపట్టణములనుండి మరియు ఇతర రాష్ట్రములనుండి బస్సుసౌకర్యము కలదు. యాగంటి ఆలయము హరిహర బుక్కరాయలకాలంలో వైష్ణవ సాంప్రదాయంలో విజయనగరరాజుల కాలములో నిర్మించబడినది. ప్రతిశివరాత్రి  పర్వదినం సందర్భంగా ఇక్కడ విశేషముగా జరిపేదరు. శివరాత్రికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనుండేకాక పరిసర రాస్త్రములనుండి భక్తులు అధికంగా వచ్చేదరు. శివపార్వతులు మరియు నంది ఇక్కడ ప్రధాన దేవతలు.   

Yaganti-Temple-Yaganti-Andhra-Pradesh

పురాణకధ ప్రకారం ఆగశ్యమహార్షి ఈప్రాంతములో వేంకటేశ్వరస్వామికి ఆలయము నిర్మించుటకు సంకల్పించుకొనగా ఆవిగ్రహముగోరు విరిగిపోవుటవలన నిరాశపడి శివుని గురించి తపస్సుచేయగా శివుడు ప్రత్యక్షమై ఈప్రదేశం శివాలయం నిర్మించుటకు అనుకూలమైనదని కైలాసం తలపించునని తెలుపగా ఆగశ్యుడు పార్వతీదేవి దర్శనంకూడా భక్తులకు అనుగ్రహించమనికోరగా శివుడు ఉమామహేశ్వర రూపంలో పార్వతీదేవితో పాటు ఒకేరాతినందు వెలసినట్లు కధనం. ప్రధానగోపురం ఐదుఅంతస్తులు కలిగిఉండి శోబాభిమానంగా కనపడుతుంది. గోపురం దాటినపిమ్మట  రంగమంటపం, ముఖమంటపం, అంతరాలయం ఉన్నవి. గర్బాలయంలో లింగరూపంమీద ఉమామహేశ్వరుల ఇద్దరిరూపాలు ఉన్నాయి ఆగశ్యుడు ఉమామహేశ్వరస్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించిన కొన్నిరోజులకు చిన్న నందివిగ్రహం స్వయంగా వెలిచినట్లు  తెలుస్తున్నది.

ఇచ్చట ఆలయం వెలుపల నందీశ్వరుని పెద్ద రాతివిగ్రహం కూర్చొనిఉన్న భంగిమలో దర్శనమిస్తుంది. నందీశ్వరుని విగ్రహం రోజు రజుకు పెరుగుతున్నది. ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. నాలుగువందల సంవత్సరములకు పూర్వం నందివిగ్రహం పరిమాణములో చిన్నదిగా ఉండేడిదని భక్తులు దాని చుట్టు ప్రదక్షిణలు కూడా చేసేవారని ప్రస్తుతం నందిపరిమాణం పెరిగి ప్రదక్షణ చేయుటకు సాధ్యంకావడం లేదని స్థానికులకధనం. నంది చిన్నగాఉన్నప్పటి చిత్రాలుగానీ, వీడియోలుగానీ లేకపోవడం వల్ల నంది పరిమాణం పెరిగింది అనడం వాస్తవం కాదనిఅంటారుకానీ నందిపరిమాణం పెరగడం నిజం. ఆలయసిబ్బంది నందిపరిమాణముపెరిగి మండపమునకుఉన్న రెండుస్తంభముల ఎత్తు తగ్గించినట్లు స్తంభముల పాదభాగం కొంత తొలగించినట్లుచెప్పిననూ నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలనుచూసి స్వయంగా నిర్ధారించుకొనవచ్చును. భారత పురావస్తువిభాగం ఈఅధికారులు జరిపిన పరిశోధనల్లో నందివిగ్రహం 20 సం.లకు అంగుళము చొప్పున అనగా సం.నకు మిల్లీమీటరు పెరుగుచునట్లు మరియు ఈ విగ్రహము మలచినరాతికి పరిమాణం పెరిగు స్వభావాం ఉన్నట్లు ధృవపరచారు.

విదేశాలలో ఎదిగే బండరాళ్లు రోమేనియాదేశంలో జీవముతో యాగంటిలోని నందివిగ్రహంవలె పెరుగుతాయిఅని, బండరాళ్ల చుట్టూ మరికొన్ని రాళ్లు పెరుగుతుంటాయని, కొన్నిరోజుల పిమ్మటఎదిగి విడిపోయి కిందపడి పెరుగుతాయని, వీటిలో జీవం ఉండదని, రాళ్లు పెరుగుటకు నీరుకావలెనని, ఈరాళ్ళు వేసవిలో సాధారణరాళ్లలా వర్షకాలం వచ్చుసరికి ఎదుగుదల ప్రారంభమవుతుందని, యాగంటి బసవన్న ఆలయమండపంలో ప్రధానద్వారంముందు ఉండటంవల్ల గాల్లోఉన్న తేమతప్ప నేరుగా వానలోతడవదు. మిగలిన శివాలయాల్లోఉండే నంది ఎందుకు పెరగడంలేదు అనేదానికి సమాధానంలేదు. భక్తులు యాగంటిబసవన్న ఎదుగుదలకు దైవలీల కారణమని  గట్టిగా నమ్ముతారు. కలియుగాంతమందు యాగంటిలోని బసవన్నలేచి రంకెలేస్తుందని సుమారు పన్నెండువందల సంవత్సములకు పూర్వం పోతులూరు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి వారురచించిన కాలజ్ఞానంలో వెల్లడించారు. కాలజ్ఞానంనందు తెల్పిన వివిధ అంశములు ప్రస్తుత కాలములో జరుగుచున్నందున అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడి నంది రోజు రోజుకు పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. లేచి రంకెలేయడానికి సిద్ధంగా ఉన్నట్లుకనిపిస్తుంది.

ఆగశ్యుడు వెంకటేశ్వరుని విగ్రహం బొటనవేలు విరగడంలో తన లోపం తెలుసుకోవడానికి తపస్సు చేశాడని ముందు వివరించబడింది. ఆ సమయంలో కాకులువచ్చి అల్లరిచేసి ఆయనతపస్సుకు భంగంకలిగించాయి. అందువల్ల ఆగశ్యుడు ఈప్రాంతంలో కాకి కనిపించ కూడదని శాపముమిచ్చాడు. అందువలన ఈక్షేత్రంలో కాకులు ప్రవేశించవు. కాకి శనిగ్రహంవాహనం, అందువల్ల శనికూడా ఈక్షేత్రంలో ప్రవేశించజాలడు. ఆలయం వెనుకభాగంలో ఒంటిస్తంభం రాయిపై కార్తీకమాసంలో కార్తీకదీపం వెలిగించేదరని ఆలయ పూజారులు తెలిపారు. కానీ ప్రస్తుతము దేవాదాయశాఖవారు ఇందునిమిత్తం ఫీజు వసూలుచేయుచున్నట్లు చెల్లించినవారిపేరుతో కార్తీకదీపం వెలిగించేదరని తెలిపినారు.

ఇచ్చటకల అగస్త్యపుష్కరిణి ప్రకృతిఒడిలో పుట్టిన జలధార. పర్వతసానువుల్లో ప్రవహించి ప్రాంగణంలో నందివిగ్రహం తరువాతఉన్న కోనేరులోచేరుతుంది. కొనేరునందు అగస్త్యమహర్షి స్నానంచెసిన కారణంగా దీనిని అగస్త్యపుష్కరిణి అని అంటారు. సంవత్సరం అన్నిఋతువుల్లో పుష్కరిణిలోని నీరు ఒకేమట్టంలో వుండడంవిశేషం. ఇందులోని నీటికి ఔషధగుణాలున్నాయని, పుష్కరిణిలో స్నానంచెస్తే సర్వరోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణినుండి ఆలయానికి వెళ్ళడానికి మెట్లమార్గం  ఉంది.                                                                                

యాగంటిలో సహజసిద్ధంగా ఏర్పడిన కొండగుహలు యాత్రికులను ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామిగుహలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం దర్శనం ఇస్తుంది. స్థలపురాణం ఈగుహను శివగుహ అంటారని చెబుతోంది. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజల నందుకొంటున్నాడు. వేంకటేశ్వరగుహ చేరుకోడానికి సుమారు 120 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ప్రక్కనే ఇంకోగుహలో బ్రహ్మంగారు కొంతకాలం నివసించారని, శిష్యులకు ఙ్ఞానోపదేశం చేసారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు.   

యాగంటిలో అనేకమైన ఉచిత ఆన్నదాన సత్రములు కలవు. ఆలయ మందు బస మరియు ఉచిత భోజనసదుపాయం కలదు. ఆలయం ఉదయం 6-00 నుండి 11-00 వరకు తిరిగి సాయంత్రం 3-00 నుండి 8-00 వరకు తెరచి ఉంటుంది.  

యాగంటిలో శ్రీ యాగంటి ఉమామహేశ్వర వాసవి సేవాసంఘమువారి నిత్యాన్న దానసత్రము ఉన్నది. ఇచట ఉదయం టిఫెన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం/అల్పాహారం బ్రాహ్మణులకు, వైశ్యులకు మాత్రము ఉచితముగా అందచేయుదురు. మన ఇష్టాను సారముగా విరాళం ఈయవచ్చును. ఇందు వసతి సౌకర్యము 9290262489 మరియు 9491612599 లకు ఫోన్ చేసి అడ్వాసు బుకింగు చేసుకొనవచ్చును. మరియు వివాహములు చేయుటకు కళ్యాణ మండపము సౌకర్యము కలదు. ఇది కాక బ్రాహ్మణులకు బ్రాహ్మణ సత్రము ఇతరులకు రైతు సేవాసంఘ సత్రము కలవు. యాగంటి పుణ్య క్షేత్రానికి 78 కి.మీ దూరంలో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం మరియు 62 కి.మీ. దూరంలో మహానంది పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.

IPLTOURS Indian Pilgrim Tours