దాకోర్ రన్ ఛోద్రజీ ఆలయం

(IPLTOURS)

శ్రీ రన్ ఛోద్రజీ మహారాజ్ ఆలయం

ఉత్తరగుజరాత్ రాష్ట్రములో ఖేడ జిల్లానందు అహమ్మదాబాద్ నకు 60 కి.మీ దూరమునందు దాకోర్ అనుఒక చిన్న పట్టణము నందు రన్ ఛోద్రజీఆలయం ఉన్నది. దాకోర్ మరియు రన్ ఛోద్రజీఆలయం ఈరెండుకూడా ప్రముఖ యాత్రాస్థలములు. దేశములోని వివిధప్రాంతములనుండి యాత్రికులు పాదయాత్ర చేసి ఈఆలయము చేరుకొనేదరు. జరాసంధుని మరణము భీమునిచేతిలో అని ఉద్దేశించబడియుండుటవలన శ్రీకృష్ణుడు జరాసంధునినుండి యుద్ధములో మధురనుండి తప్పించుకొని రన్ ఛోడ్ అను ఈపేరు పొందినట్లు కధనము. ఆలయమునందు శ్రీకృష్ణుడు నాలుగుచేతులలో శంఖము, చక్రము, కలువ మరియు గధ కలిగి ఉంటాడు. ఆలయమును చేర్చిదగ్గరలో ఉన్నఒకచిన్న చెరువునందు ఆలయసందర్శకులు ఇందుకల చేపలకు మరియు తాబేళ్ళకు ఆహారము అందించెదరు. ఇచ్చటకూడా శ్రీకృష్ణుడు పుట్టినరోజైన జన్మాష్టమి మిక్కిలి వైభవముగా జరిపేదరు.

shri ranchhodraiji maharaj temple dakor

దాకోర్ ఈఆలయము నిర్మాణము కాకముందునుండికూడా డంకనాధ్ పేరుతో శివుని పూజించు స్థలమై ప్రాచుర్యమునందు ఉన్నది. సుమారు మూడువందల సంవత్సరములకు పూర్వమునుండి రన్ ఛోద్రజీ (శ్రీకృష్ణుని మరో రూపం) ఆలయము నిర్మాణము పిమ్మట వైష్ణవులకు కూడా పవిత్రక్షేత్రము అయినది. 

మహాభారతకాలమునందు దాకోర్ హిడింబవనము (అడవి) గా ప్రసిద్ధము. దట్టమైన అడవితో ఈప్రాంతము బుగ్గలు సరస్సులతో ఆహ్లాదకరముగా నుండేదిది. ఈప్రాంతము మునులు తపస్సు చేసుకొనుటకు ఆశ్రమప్రాంతముగా ఆకర్షణీయముగా నుండేడిది. దాంక్ ఋషి ఆతని ఆశ్రమము ఈచటానిర్మించుకొనినాడు. తపస్సు చేయునప్పుడు శివుడి సంతసించి ఆతనిని కోరిక తెలుపమన్నాడు. అప్పుడు ఋషి శివుని శాశ్వతముగా తనఆశ్రమములో నివాసము ఉండవలసినదిగా కోరినాడు. శివుడు ఆతనికొరికకు అంగీకరించి లింగరూపములోనుంచి మాయమైనాడు. ఆయననే దంక్ నాధ్ మహదేవ్ పేరుతో ప్రసిద్ధిచెందినాడు. ఈప్రాంతములో మోదుగ (ఖాఖర) చెట్లు అధికము.  

శ్రీకృష్ణుడు, భీముడు ఒకసారి దంక్ ఋషిఆశ్రమము దర్శించుటకు వెళ్ళగా, ఋషిఇరువురిని ఆహ్వానించినాడు. శ్రీకృష్ణుడు భక్తులు అనిన దయకలవాడు అయినందున దంక్ ఋషిని వరము కోరుకొమ్మని అడిగినాడు. దానికి దంక్ ఋషి శాశ్వతముగా అచ్చట శివునితోపాటు నివసించమనికోరినాడు. శ్రీకృష్ణుడు తాను ద్వారకానందు 4225 సంవత్సరములు నివసించినాపిమ్మట కలియుగములో ఆచటికి వచ్చి శాశ్వతముగా నివసించేదనని తెలిపినాడు. ఆప్రకారము శ్రీకృష్ణుడు దాకోర్ ఆహ్వానించబడినాడు. 

దాంక్ ఋషి గతజన్మనందు గోకులమునందు జన్మించిన విజయానందుడుఅను ఒక పశువుల కాపరి, తరువాతి కాలములో శ్రీకృష్ణునికి గొప్పభక్తుడైనాడు. హోలీరోజున ఒక్కవిజయానందుడు తప్పమిగిలీన అందరూ పశువులకాపరులు శ్రీకృష్ణుని పూజించేడివారు. ఆయన భార్యకూడా శ్రీకృష్ణుని పూజించేడిది కానీ విజయానంద్ ఇంటివద్ధే ఉండేదివాడు శ్రీకృష్ణుడు మారువేషములో విజయానందుని ఇంటికివచ్చి ఆతనినికూడా హోలీపూజ చేయుటకు పంపినాడు. తిరిగివచ్చిన విజయానంద్ తనస్నేహితుడు శ్రీకృష్ణుడు అనిగ్రహించి మరుసటిరోజు రంగులతో ఆనందించినాడు. ఆఆటలందు శ్రీకృష్ణుడు నదిలో పడినాడు. విజయానందునికి శ్రీకృష్ణుడు తనవాస్తవరూపము తెలుపగా విజయానందుడు క్షమాపణ కోరినాడు. శ్రీకృష్ణుడు దయకలిగి ఆతనిని ఓదార్చితాను మరలాకలియుగములో విజయానంద్ భోధన పేరుతో మరల జన్మించెడదని, ఆతనిభార్య  మరల గంగాభాయి పేరుతో ఆతని భార్యగా జన్మించునని అప్పుడుతాను దర్శనముయిచ్చి ముక్తిప్రసాదించేదనని తెలిపినాడు. 

విజయానంద్ భోదనపేరుతో రాజపుత్రునిగా జన్మించి శ్రీకృష్ణునికి భక్తుడు అయినాడు. భోదన తనతోపాటు తులసిమొక్క ఒక కుండనందుపెంచి అరచేతినందుంచుకొని ఆరునెలలకు ఒకపర్యాయము ద్వారకనందు శ్రేకృష్ణుని తులసిఆకులతో పూజించుటకు వెళ్ళేడివాడు. అట్లే 72 సంవత్సరములు వచ్చువరకు ఎటువంటి ఆటంకములేకూడా సేవించినాడు. క్రమముగా ఆతనికి ఓపిక తగ్గి అట్లుచేయుట శ్రీకృష్ణదర్శనమునకు ద్వారకవచ్చుట కష్టమైనది. ఎడ్లబండిలో వచ్చేడివాడు. శ్రీకృష్ణుడు ఆతనిని తిరిగి దాకోర్ వెల్లునప్పుడు ఆతనితో వెళ్ళేడివాడు.

shri ranchhodraiji maharaj temple lord idol dakor gujarat

ద్వారకలోని వంశపారంపర్య పూజారులు ఎడ్లబండిని భోదనచెప్పు మాటలునమ్మక ఆఎడ్లబండిని ద్వారకలోని గర్భాలయమునందు ఉంచి తాళము వేసి సీలువేసివారు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడు అన్నిద్వారములు తెరచి భోధననులేపి దాకోర్ బయలుదేరదీసి ఆతని విశ్రాంతి తీసుకొనమని తానుబండినడిపినాడు. త్రోవనందు ఒకవేపచెట్టువద్ద విశ్రాంతితీసుకొనినారు. ఇప్పటికినీఆవేపచెట్టు యొక్క ఒకకొమ్మఆకులు చాలాతీపిగా ఉండునని మిగతా కొమ్మలు అన్నియు మామూలుగానే ఉండునని నానుడి.                         

ద్వారకనందు పూజారులు శ్రీకృష్ణుని విగ్రహము కనపడక బొదనను అనుసరించి దాకోర్ చేరినారు. బొదన భయపడిననూ శ్రీకృష్ణుడు ఆవిగ్రహమును గోమతినదినందు దాచిపూజారులను కలుసుకొనమని తెలిపాడు. ఆప్రకారమే బొదన ఆవిగ్రహము దాచి పూజారులను కలియుటకువెళ్లి వారిని శాంతింపచేయుటకు వారిఎదుట ఒకకుండతో పెరుగు ఉంచినాడు. వారు ఆతనిపై కోపము తెచ్చుకొని అతనిపై  ఒకఈటె విసిరినారు. ఆతను క్రిందపడి మరణించినాడు. ఆతనిపై విసిరిన ఈటె గోమతినందుకల దైవముపైపడి అందలినీరు కృష్ణుని రక్తముతో ఎర్రపడినది. ఈరోజునకు కూడా ఆవిగ్రహము ఉంచిన ప్రదేశములో నీరుఎర్రగాను మిగిలిననీరు గోధుమరంగు బురదతో నిండిఉంటుంది. శ్రీకృష్ణుని విగ్రహముదాచిన ప్రదేశమునందు శ్రీకృష్ణుని పాదముద్రలతో చిన్నదేవాలయము నిర్మించబడి గోమతిఒడ్డు ఒకవంతెనతో అనుసంధానము చేయబడినది.                                                                                       

బొదన మరణముతో పూజారులు సంతృప్తులు కాలేదు. గోమతిగట్టున కూర్చొని నిరాహారదీక్ష చేసినారు. చివరకు రన్ ఛోద్రజీ (శ్రేకృష్ణుడు) బొదన భార్యఅయిన గంగాబాయిని తనబరువుతో సమానమైన బరువుకల బంగారము పూజారులకు చెల్లించి వారిని తిరిగి ద్వారక పంపివేయమని చెప్పినాడు. విధవమరియు నిరుపేద అయిన బొదన ఆప్రకారము చేయలేకపోయినది. ఆశ్చర్యకరముగా ఆవిగ్రహము గంగాభాయి ధరించిన ప్రకాశవంతమైన ఒకఉంగరముగా మారిపోయినది. పూజారులు నిరుత్సాహముచెంది స్వామిదయాగుణముతో వారుఆరునెలలు గడచినాపిమ్మట తనవిగ్రహమునకు ప్రతిరూపం ద్వారక నందు సేవాధన్ వావ్ అనబడు బావినందు కనపదునని తెలిపినాడు. సహనములేనిపూజారులు వారికి తెలిపిన సమయము కంటే ముందుగా చూడగా ఆవిగ్రహమువలే ఉన్ననూ అంతకంటే చిన్నవిగ్రహము కనపడినది. దాకోర్ దర్శించు యాత్రికులు ఈకధనమునకు సంబంధించిన ప్రదేశములను అనగా కృష్ణుడు విశ్రమించిన వేపచెట్టు, గోమతిచెరువునందు విగ్రహముదాచిన ప్రదేశము దర్శించేదరు.

ఆలయము ఉదయం 6-45నుండి 12-00వరకు మరలా 4-15నుండి 7-30వరకు తెరచి యుండును. ఉదయపూర్ నందు మధ్యతరహా మరియు ఉన్నతశ్రేణి హోటల్స్ భోజన మరియు వసతిసౌకర్యార్ధము కలవు.