బ్రహ్మంగారి మఠం

(బనగానపల్లి)
(IPLTOURS)

భవిష్యత్తులో భూమిపై జరుగబోవు వింతలు విశేషాలతో కూడిన కాలజ్ఞానం రచించిన వారిగా భావించ బడుచున్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జన్మించిన బనగానపల్లె యాగంటి నుండి నంధ్యాల పోవు రోడ్డు మార్గములో యాగంటికి 11 కి.మీ దూరములోఉన్న గ్రామము. వీరబ్రహ్మం పుట్టినతేదీపైకాని జీవితం గురించికానీ స్పష్టమైన ఆధారములులేవు. విభిన్నవాదనలప్రకారము వీరు 9 లేదా 17వ శతాబ్దమునకు చెందినవారుగా భావించబడుచున్ననూ వీరు 1608 సంవత్సరమునందు జన్మించి 1693 వరకు జీవించినట్లు తెలియుచున్నది. లబ్యముగాకల సమాచారము ప్రకారము తీర్ధయాత్రలు చేయుచున్న పరిపూర్ణచారి, ప్రకృతాంబ అను విశ్వబ్రాహ్మణ దంపతులకు కాశీ పట్టణములో జన్మించినట్లు, వారుఆతనిని కాశీవద్దకల అత్రి మహాముని ఆశ్రమమునందు అప్పగించగా అచ్చట పెరిగినట్లు, పాపాగ్ని మఠాధిపతి వీరభోజాచార్య భార్య వీరాపాపమాంబాతోపాటు కాశీసందర్శించినప్పుడు అత్రిమహాముని ఆయనకువప్పగించినట్లు, భగవత్ ప్రసాదముగాభావించి వారు అతనికి వీరబొట్టయ్యఅని పేరుపెట్టినట్లు తెలియుచున్నది. 

Lord Veerabhraremdra swamy Brahmamgari Matam Banaganapalle

11 సం వయస్సులో కాళికాసప్తపది అనుగ్రంధము వ్రాసిన వీరబొట్టయ్య సంసార బంధనములను తిరస్కరించి ఆధ్యాత్న్మిక జీవనయానము కొనసాగించినట్లు, దూదేకుల సిద్ధయ్య ప్రధమశిష్యుడు అయినట్లును, ప్రజలు ఆయనచెప్పు ఆధ్యాత్న్మిక ప్రవచనములకు ఆయనను వీరబ్రహ్మేంద్రస్వామిఅని  పిలిచేడివారని, ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వింతలు విశేషాలతోకూడిన కాలజ్ఞానం బనగానపల్లెకు 8 కి.మీ. దూరములోనున్న రవ్వలకొండనందు కల గృహనందు వ్రాసినట్లు కందిమల్లయ్యపల్లెనందు సజీవసమాధి అయినట్లు గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నట్లు తెలియుచున్నది.  సదరువ్రాతప్రతిని  1970 సంవత్సరమునందు ముద్రించినట్లు తెలియుచున్నది. పిమ్మట కందిమల్లయ్యపల్లే బ్రహ్మంగారిమఠం పేరుతో ప్రాచుర్యమైనది. 

వీరు భవిష్యత్తుగురించి చెప్పిన వింతలువిశేషాలు వాస్తవములో జరిగి యున్నవి మరియు జరుగుచున్నవని భావిస్తారు. వారే కాలజ్ఞానం నందు కలియుగాంతమునందు యాగంటినందున్న రాతిబసవన్న జీవముతోలేచి రంకేవేయునని తెలిపినారు. బనగానపల్లె మామిడిపండ్లకు ప్రసిద్ధి. మామిడిపండ్లలో బంగినపల్లిపేరుతో పండ్లరకం కలదు. తెలుగుగంగ ప్రాజెక్టునందు ఒకభాగమైన రిజర్వాయర్ నకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రిజర్వాయరు పేరుపెట్టబడినది. దీనేనే సుంధుపల్లి రిజర్వాయరు అనికూడా పిలిచేదరు. ఈరిజర్వాయరుకు పూర్వపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీ.శే. నందమూరి తారకరామారావుచే శంకుస్థాపన కావింపబడినది. చుట్టుప్రక్కల కలకొండలతోపాటు ఈరిజర్వాయరుకూడా జనాకర్షణకల పర్యాటకప్రదేశము. ఇచ్చట నౌకావిహారమునకు పడవలు లభ్యమవుతాయి.  

ప్రాధమికముగా ఓబులరాజుపల్లె నందు బొమ్ము కుంటుంభముచే ఆలయము నిర్మించబడినది. దర్మిలా ఆఆలయము మరియు ఓబురాజుపల్లే 2005 సం.లో బ్రహ్మసాగర్ రిజర్వాయరు నిర్మాణమునందు మునిగిపోయినది. ఈకుటుంభము 2008 సం.లో ట్రస్ట్ స్థాపించి నూతనఆలయమును నిర్మించినారు. మతమునందు ఉచిత భోజన వసతి కలదు.

IPLTOURS Indian Pilgrim Tours