నవ నరసింహ క్షేత్రములు

(అహోబిలం)
(IPLTOURS)

పవిత్రపుణ్యక్షేత్రమైన అహోబిలం నల్లమల ఆటవీప్రాంతమునందు నంద్యాలకు 65 కి.మీ దూరము లోను ఆళ్ళగెడ్డకు 24 కి.మీ శ్రీశైలమునకు రోడ్డుమార్గములో 243 కి.మీ దూరములోనూఉన్నది. గరుడునికోరిక తీర్చుటకొరకు నృసింహుడు అహోబిళం చుట్టుప్రక్కల దట్టమైన నల్లమలఅదవులలో అయిదుకిలోమీటర్ల కొండలపై 1.జ్వాలానృసింహ, 2.అహోబిల నృసింహ, 3.మాలోలనృసింహ, 4.వరాహ లేదా క్రోధనృసింహ, 5.కారంజనృసింహ, 6.భార్గవనృసింహ, 7.యోగానంద నృసింహ, 8.క్షత్రవాతనృసింహ మరియు 9 పావన లేదా హోలీనృసింహఅను  తొమ్మిది వివిధరూపములలో నృసింహ స్వామి వెలసినాడు. గరుడునికోరికపై స్వామి ఇచ్చట వెలయుటవలన ఈకొండలను గరుడాద్రి, గరుడాచలం, గరుడశైలం అని పిలుస్తారు. విష్ణువు ఉగ్రనృసింహ రూపములో హిరణ్యకశిపుని వధించి తనభక్తుడు ప్రహ్లాదుని రక్షించిన ఈప్రదేశములో లక్ష్మీదేవి చెంచులక్ష్మి రూపములో నృసింహుని ఉగ్రరూపము శాంతింపచేసినది. ఈకొండల దిగువన ప్రహ్లాదవరద వరధాన్ ఆలయము ఉన్నది. భద్రతాకారణములరీత్యా ఎగువ ఆలయములలోని ఉత్సవమూర్తులను ఈఆలయముయనందు భద్రపరచెదరు. అహోబిలం నందు పరవనాశిని, భార్గవ, ఇంద్ర, నృసింహ,గజ అనుపేర్లతో పుష్కరిణితీర్ధములు ఉన్నవి.                                       

నవనృసింహ క్షేత్రములలో ఎగువభాగములో అనగా కొండలపైఉన్న మాలోలనృసింహ, వరాహనృసింహ మరియు జ్వాలా నృసింహ క్షేత్రములు చేరుట కస్టము కావున ఈక్షేత్రములు దర్శించుటకు వృద్ధులు డోలీపై వెళ్లవలసి ఉంటుంది. లక్ష్మీనృసింహ, క్షత్రవాతనృసింహ, ప్రణవ లేదా హోలీనృసింహ, యోగానందనృసింహ మరియు భార్గవనృసింహ క్షేత్రములు దిగువ అహోబిలం నందున్నవి. కారంజనృసింహ క్షేత్రమునకు కొద్దిదూరము కొండ శ్రమతో ఎక్కవలసి ఉంటుంది. ఇచ్చట అహోబలేశ్వర్ ఆలయముకూడా ఉన్నది. 

ఋషులు ఈకొండలపై తపముచేసి కలియుగములో ఈప్రాంతము జనపధములో కలసిపోవునని గ్రహించి నృసింహగుహను గండశిలలతోకప్పి ఉత్తరప్రాంతమునకు తరలివెలిపోయినారు అని స్థానికకధనము. ఋషులు స్టాపించి కొలచిన ప్రదేశములు నవనృసింహ క్షేత్రములుగా ప్రసిద్ధిచెందినవి. సంప్రదాయముగా నృసింహుని పేరుతో ఈప్రదేశము నృసింహ క్షేత్రముగా ఖ్యాతగాంచినది. ఋషులు స్థాపించి పూజించిన ఈనవనృసింహక్షేత్రములు పైనుండిక్రిందకు వరుసగా “జ్వాల అహోబిల మాలోల కరంజ భార్గవ ! యోగానంద క్షత్రవాత పావన నవమూర్తయాః !!అని ప్రసిద్ధి కాంచినవి. పూర్వము నవనృసింహ క్షేత్రములు దేవతలుతప్ప ఇతరులు దర్శించుకొను అవకాశములేని విధముగా దట్టమైన అటవీప్రాంతముగా నుండేడిదిఅని కాలక్రమేణా 45వ అహోబిలమఠాధిపతి వయస్సుతో నిమిత్తము లేకుండా భక్తులు అందరూ తేలికగా దర్శించుకొనుటకు మార్గములు ఏర్పాటు చేసినారు అనితెలియుచున్నది.  

రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి మరియు కుమారుడు ప్రహ్లాదుడు తల్లిలీలావతివలెనే చిన్నతనమునుండి విష్ణుభక్తుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విష్ణువుపైనున్న భక్తిమార్గమునుండి తప్పించుటకు అనేకవిధములుగా ప్రయత్నములు చేసినాడు. అనేకవిధములుగా ప్రహ్లాదుని ప్రాణములు తీయుటకు ప్రయత్నించినాడు. ఏనుగులచే  త్రోక్కించుట, నాగులచే కాటువేయించుట, కొండపైనుండి లోయలోకి పడవేయించుట, మరియు అగ్నిలో పడవేయించు ద్వారా ప్రయత్నము చేసినాడు. అయినా  ప్రహ్లాదునికి హానికలుగలేదు. అప్పుడు శ్రీహరిఉన్న ప్రదేశము చూపుమనగా ప్రహ్లాదుడు అన్నిచోట్లకలడని జవాబు ఈయగా స్తంభమునందుచూపమనుచూ తనగధతో స్తంభముపగులకొట్టగా విష్ణువు హిరణ్యక్షిపుడు మనిషివలనకాని, జంతువువలనకానీ, పగలుకాని, రాత్రిగాని, ఇంటిలోకాని, ఇంటిబయటకాని, ఆయుధముతోకానీ మరణము సంభవించకుండా బ్రహ్మవలన పొందినవరము పొందియుండుటవలన సగముమనిషి, సగముసింహము కలసిన ఉగ్రనృసింహరూపములో ఆసురసంధ్యవేళ స్తంభమునుండి బయటికివచ్చి మందిరము గడపపైకూర్చొని హిరణ్యకశిపుని తనతొడలపైఉంచుకొని చేతిగొరులతో రొమ్ముచీల్చి భయంకరముగా ప్రేగులు బయటకు లాగి సంహరించినాడు. ఉగ్రనరసింహుడు హిరణ్యకశిపుని సంహరించిన ప్రదేశమునుండి మరల శాంత రూపమునకు వచ్చువరకు నృసింహుడు తిరిగిన ప్రదేశములు నవనృసింహక్షేత్రములుగా ప్రసిద్ధి చెందినవి.       

అహోబల నృసింహ స్త్రోత్రం

లక్ష్మీకటాక్ష సరసీరుహ రాజహంసం
పక్షీంద్ర శైలభవనం భవనాశామీశం
గోక్షీరసారా ఘనసార పటీరవర్ణం
వందే కృపానిధిం మహోబల నారసింహం
ఆధ్యంత శూన్యమజమ ఆవ్యయమప్రమేయం
ఆదిత్యచంద్ర శిఖీలోచన మాదిదేవం
అభ్యముఖాబ్జ మదలోలుప మట్టభృంగం
వందే కృపానిధిం మహోబల నారసింహం
కోటీరకోటి ఘటితోజ్జ్వల కాంతికాంతం
కేయూరహార మణికుండిల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకర పూర్ణబింబం
వందే కృపానిధిం మహోబల నారసింహం
వరాహవామన నృసింహ సుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుధెంద్రవంధ్యం
హింసాత్మకం పరమహంసమనోవిహరం
వందే కృపానిధిం మహోబల నారసింహం
మందాకినీ జనన హేతుపదారవిందం 
బృందారకాలయ వినోదన ముజ్జ్వలాంగం
మందారపుష్ప తులసీ రచితాంఘ్రిపద్మం
వందే కృపానిధిం మహోబల నారసింహం
తారుణ్యకృష్ణ తులసీదళ ధామరమ్యం
ధాత్రీ రమాభిరమణం మహనీయరూపం
మంత్రాధిరాజ మధదానవ మానభృంగం
వందే కృపానిధిం మహోబల నారసింహం

భక్తులు సాంప్రదాయ దుస్తులతోనే ఆలయములు సందర్శించవలెను. అహోబిల నృసింహక్షేత్రములు అహోబిలమఠంవారి పర్యవేక్షణయందు ఉన్నవి. ఈనవనృసింహ ఆలయములలో అన్నిఆలయములందు అర్చనలకు పూజారులు లభ్యముగా ఉందురు. యాత్రికుల అభ్యర్ధనపై వీరు నృసింహునికి అర్చనలు చేయుదురు. కావున దిగువ అహోబిలమునందు అవసరమైన పూజా సామాగ్రి తీసుకొని నృసింహక్షేత్రములదర్శనము ప్రారంభించవలెను. ఆహోబిలమునందు నవనృసింహక్షేత్రములు దర్శించుటకు కనీసము రెండుతోజులు ఒకరోజుబడలిక తీర్చుకొనుటకు అవసరము. కొండలపై ఉన్న మాలోలనృసింహ, వరాహనృసింహ మరియు జ్వాలానృసింహ క్షేత్రములు చేరుటకు వృద్ధులు మరియు నదువలేని వారికొరకు డోలీఏర్పాటు కలదు. డోలీరుసుము సుమారు రూ 4000 వరకు చెల్లించవలయును. ఇచట పర్యాటకశాఖ మరియు ప్రయివేటుహోటళ్ళు మరియు ఆర్యవైశ్య, పద్మశాలి, రెడ్డిసత్రములందు వసతి సదుపాయముకలదు. ఎగువ అహోబిలము ప్రారంభములో అఖిలభారత కరవేన బ్రాహ్మణుల ఉచిత నిత్యాన్నదాన సత్రముకలదు. ఈనృనృసింహ క్షేత్రములు. మేము సూచించిన రీతిలో తేలికగా దర్శించవచ్చును. ముందుగాదిగువ అహోబిలమునందున్న నాలుగు క్షేత్రములు అనగా యోగానంద, భార్గవ, పావన ఛత్రవాతనృసింహ క్షేత్రములతోపాటు ప్రహ్లాదవరదాన్ ఆలయము దర్శించి, మరుసటి రోజు ఉదయమే బయలుదేరి దిగువ అహోబిలము నుండి 8 కి.మీ దూరములో నున్నఎగువ అహోబిలమునకు మార్గ మధ్యములో కల కరంజ, అహోబిల నృసింహులను పిమ్మట క్రోధాకార, మాలోల మరియు జ్వాలానృసింహులను దర్శించవలెను. సమయమును బట్టి ఉగ్రస్తంభము మరియు ప్రహ్లాదునిబడి  దర్శించుటకు వెళ్లవచ్చును. జ్వాలానృసింహ మార్గములో భవనాశిని జలపాతము చూడవచ్చును. ఎగువ అహోబిలమునందు స్థానికముగాకల గైడ్ సహకారముతో కానీ లేదా వృద్ధులు మరియు నదువలేనివారు అయినట్లుఅయిన డోలీ ఏర్పాటు  చేసుకొని ఆలయసందర్శనమునకు వెళ్లవలయును.